Animal movie review : యానిమల్‌ ...మెప్పించిందా ?

0

అర్జున్‌ రెడ్డి’తో దేశం మొత్తం మార్మోగిన పేరు.. సందీప్‌రెడ్డి వంగా. రామ్‌గోపాల్‌ వర్మ తర్వాత మళ్లీ ఓ సినిమాతో అంత ప్రభావం చూపించిన దర్శకుడిగా సందీప్‌ పేరు సంపాదించారు. ఆ సినిమానే ఆయన్ని బాలీవుడ్‌ వరకూ తీసుకెళ్లింది. అక్కడ ‘అర్జున్‌రెడ్డి’ని రీమేక్‌ చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ రెండు సినిమాలు ఆయనకి రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి సినిమా చేసే అవకాశం కల్పించాయి. బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ - తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కలయికలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రమే... ‘యానిమల్‌. కొన్నాళ్లుగా ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ప్రచార చిత్రాలతో ఈ సినిమా మరిన్ని అంచనాల్ని, ఆసక్తిని రేకెత్తించింది. మరి ఈసినిమా ఎలా ఉంది? రణ్‌బీర్‌ను సందీప్‌ ఎంత వైల్డ్‌గా చూపించారు? సందీప్‌ వంగా దర్శకత్వంలో రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘యానిమల్‌’. అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఫాదర్‌ అండ్‌ సన్‌ సెంటిమెంట్‌ ని చూపిస్తూ నేడు థియేటర్స్‌ లో పాన్‌ ఇండియా వైడ్‌ గ్రాండ్‌ గా రిలీజయింది. ఇక ఈ సినిమా టీజర్‌, సాంగ్స్‌, ట్రైలర్‌ నుంచి సినిమాపై భారీ హైప్‌ నెలకొంది.

కథ విషయానికి వస్తే..

రణ్‌ విజయ్‌ సింగ్‌(రణబీర్‌ కపూర్‌) కి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న బల్బీర్‌ సింగ్‌(అనిల్‌ కపూర్‌) అంటే చాలా ఇష్టం. కానీ బల్బీర్‌ దేశంలోనే పెద్ద బిజినెస్‌ మ్యాన్‌ అవ్వడంతో పిల్లలకు టైం ఇచ్చేవాడు కాదు, వాళ్ళని పట్టించుకునేవారు కాదు. ఈ విషయం రణ్‌ విజయ్‌ ని బాధపెడుతుంది. చిన్నప్పుడు రణ్‌ విజయ్‌ చేసిన ఓ తప్పుకి వాళ్ళ నాన్న బాగా కొట్టి ఇంటికి దూరంగా పంపించి చదివిస్తాడు. చదువు అయ్యాక తిరిగొచ్చిన రణ్‌ విజయ్‌ తన చిన్ననాటి స్నేహితురాలు గీతాంజలి(రష్మిక) నిశ్చితార్థానికి వెళ్లి తన ప్రేమని ఇండైరెక్ట్‌ గా తెలియచేయడంతో ఆమె ఇంట్లో గొడవపడి రణ్‌ విజయ్‌ కోసం వచ్చేస్తుంది. అదే టైములో రణ్‌ విజయ్‌ ఇంట్లో గొడవపడటంతో ఇంట్లోంచి పంపించేస్తారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు బల్బీర్‌ సింగ్‌ మీద అటాక్‌ జరగడంతో రణ్‌ విజయ్‌ మళ్ళీ ఇండియాకి వస్తాడు. రణ్‌ విజయ్‌- గీతాంజలి ప్రేమని రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయా? బల్బీర్‌ సింగ్‌ మీద దాడి చేసింది ఎవరు? వాళ్లపై రణ్‌ విజయ్‌ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? చివరికి నాన్న ప్రేమని రణ్‌ విజయ్‌ పొందడా? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..

సినిమా ఓపెనింగ్‌ నుంచే నాన్న ఎమోషన్‌ ని బాగా క్యారీ చేసి నడిపించాడు దర్శకుడు. మొదటి అరగంట నాన్న ఎమోషన్‌ తో మెప్పిస్తాడు. ఆ తర్వాత రష్మికతో ప్రేమ, పెళ్లి, రొమాన్స్‌ సన్నివేశాలతో గడిచిపోతుంది. వాళ్ళ నాన్న మీద అటాక్‌ జరిగిన వాళ్ళ కోసం వెతుకుతూ ఓ భారీ మాస్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ తో ఇంటర్వెల్‌ అదిరిపోతుంది. ఇక సెకండ్‌ హాఫ్‌ లో గాయపడిన రణ్‌ విజయ్‌ ఎలా కోలుకున్నాడు, తన జీవితంలోకి ఇంకో అమ్మాయి రాగా ఆమెతో రొమాన్స్‌ సన్నివేశాలు అంటూ ఒక అరగంట సాగదీసినట్టు ఉంటుంది. ఈ సీన్స్‌ లో చాలా వరకు ఎడిటింగ్‌ లో కట్‌ చేయొచ్చు. ఇక క్లైమాక్స్‌ లో వాళ్ళ నాన్నని చంపడానికి ట్రై చేసింది ఎవరు అనేది కనుక్కొని యాక్షన్‌ సీన్‌ ఓకే అనిపిస్తుంది. క్లైమాక్స్‌ లో మరోసారి నాన్న ఎమోషన్‌ తో రణబీర్‌, అనిల్‌ కపూర్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని కంటతడి పెట్టిస్తాయి. అలాగే సినిమా ఎండిరగ్‌ లో ఇచ్చిన ఓ ట్విస్ట్‌ తో సినిమా మంచి హైప్‌ తో ముగుస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే..

రణబీర్‌ ఈ పాత్రలో జీవించాడనే చెప్పొచ్చు. కాలేజీ స్టూడెంట్‌ లా, యువకుడిలా, పెళ్లయిన వాడిలా, పేషంట్‌ లా.. అన్ని పాత్రల్లోనూ బరువు తగ్గుతూ, పెంచుతూ రణ్‌ విజయ్‌ పాత్ర కోసం బాగా కష్టపడ్డాడు. యాక్షన్‌, ఎమోషన్‌ సీన్స్‌ లో అందర్నీ మెప్పిస్తాడు. ఇక గీతాంజలిగా రష్మిక మెప్పిస్తుంది. సెకండ్‌ హాఫ్‌ లో వచ్చే ఓ ఎమోషన్‌ సీన్‌ లో రష్మిక అదరగొట్టేసింది చెప్పొచ్చు. తండ్రిగా అనిల్‌ కపూర్‌ నాన్న ఎమోషన్‌ ని బాగా పండిరచారు. బాబీ డియోల్‌, త్రిప్తి దిమోరి, శక్తి కపూర్‌, బబ్లూ పృథ్వి, శ్రీనాథ్‌.. పలువురు వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక విలువలు..

సినిమాకు సంగీతం చాలా బాగా ప్లస్‌ అవుతుంది. ఎమోషన్‌ సీన్స్‌, యాక్షన్‌ సీన్స్‌లో బీజీఎం అదిరిపోతుంది. నాన్న సాంగ్‌ ని, మ్యూజిక్‌ ని మొదటి నుంచి చివరి వరకు బాగా నడిపించాడు. యాక్షన్‌ సీన్స్‌ చాలా కొత్తగా డిజైన్‌ చేశారు. కెమెరా విజువల్స్‌ కూడా కొత్త కొత్త షాట్స్‌ తో చూపించారు. ఇక స్టార్‌ హీరో సినిమా కాబట్టి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉంటాయి. కాస్ట్యూమ్స్‌ గురించి కూడా చెప్పుకోవాలి. రణబీర్‌ ఏ పాత్రలో ఉన్న దానికి తగ్గట్టు పర్ఫెక్ట్‌ గా, సన్నివేశానికి తగ్గట్టు కొత్తగా డిజైన్‌ చేశారు. మొత్తంగా నాన్న ఎమోషన్‌ తో ఏడిపిస్తునే నాన్న కోసం చంపడానికి చావడానికి రెడీ అయిన ఓ కొడుకు కథని అద్భుతంగా చూపించాడు సందీప్‌ వంగా. బాలీవుడ్‌ మరోసారి సౌత్‌ డైరెక్టర్‌ కి జై కొట్టాల్సిందే ఈ సినిమా తర్వాత. సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తుండటంతో కలెక్షన్స్‌ కూడా భారీగా అంచనా వేస్తున్నారు. 


ఈ సినిమా రివ్యూ కేలవం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. వారి వారి దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !