TS Cabinet : తెలంగాణ మంత్రులకు శాఖలకు కేటాయింపు !

0

2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌​ పార్టీ దాదాపు దశాబ్ద కాలం పాటు అధికారం కోసం వేచి చూడాల్సి వచ్చింది. మార్పు రావాలంటే కాంగ్రెస్‌​ రావాలనే నినాదంతో ఈసారి ఎన్నికలకు వెళ్లి విజయాన్ని సాధించింది. పార్టీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్‌​ రెడ్డిని కాంగ్రెస్‌​ పార్టీ సీఎంగా ప్రకటించింది. దీంతో నేడు ఆయన ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్‌​తో పాటు 11 మంది అమాత్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల కూర్పులో కాంగ్రెస్‌​ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన వారికి అధిష్ఠానం పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో భట్టి విక్రమార్క, ఉత్తమ్‌​ కుమార్‌​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌​బాబు, పొంగులేటి శ్రీనివాస్‌​ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌​ రావు, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌​ మొదలుగు వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన సభ్యులకు వెంటనే శాఖల కేటాయింపు జరిగింది.

మల్లు భట్టి విక్రమార్క : (డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రిత్వ శాఖ)

మధిర నియోజకవర్గంవిద్యార్హతలు: ఎం.ఎ.ఎమ్మెల్యే: 2009, 2014, 2019, 2023ఎమ్మెల్సీ: 2007-2009పదవులు: ప్రభుత్వ విప్‌, ఉపసభాపతి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సీఎల్పీ నేత

ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి : (హోం మంత్రిత్వ శాఖ)

హుజూర్‌ నగర్‌ నియోజకవర్గంవిద్యార్హత : బీఎస్సీలో గ్రాడ్యుయేట్భారత వైమానిక దళంలో మాజీ ఫైటర్‌ పైలట్రాజకీయ అరంగేట్రం: 1994ఎమ్మెల్యేగా : 1999, 2004, 2009, 2014, 2018, 2023ఎంపీ: 2019 నల్గొండపదవులు: గృహ నిర్మాణశాఖ మంత్రి,2014లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు,2015 పీసీసీ అధ్యక్షుడుకాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడు

జూపల్లి కృష్ణారావు : (పౌర సరఫరాల శాఖ)

కొల్లాపూర్‌ నియోజకవర్గంరాజకీయ అరంగేట్రం - 1999ఎమ్మెల్యే: 2004, 2009, 2012, 2014పదవులు: ఆహార, పౌర సరఫరాల శాఖ, దేవాదాయశాఖ, పంచాయితీ రాజ్‌ %డ%గ్రామీణాభివృద్ధి శాఖ2011లో టీఆర్‌​ఎస్‌​లో చేరిక2023లో కాంగ్రెస్‌లో చేరిక

దామోదర రాజనర్సింహ : (ఆరోగ్య శాఖ)

ఆందోల్‌ నియోజకవర్గం1989లో రాజకీయ ఆరంగేట్రంఎమ్మెల్యే: 1999, 2004, 2009, 2023పదవులు: ఉప ముఖ్యమంత్రి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌

దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు : (ఆర్థిక మంత్రిత్వ శాఖ)

మంథని నియోజకవర్గంవిద్యార్హత %--% పొలిటికల్‌ సైన్స్రాజకీయ అరంగేట్రం - 1999ఎమ్మెల్యేగా - 1999, 2004, 2009, 2018, 2023మంత్రి పదవి: పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలులీగల్‌ మెట్రాలజీ %డ%శాసనసభ వ్యవహారాల మంత్రి

పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి : (నీటి పారుదల శాఖ)

పాలేరు నియోజకవర్గంవిద్యార్హతలు: దూరవిద్యలో డిగ్రీ, ఎల్‌.ఎల్‌.బి.రాజకీయ అరంగేట్రం: 2013లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌2014లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు2014 లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌ సభ్యుడు2016లో టీఆర్‌​ఎస్‌​లో చేరికరవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్టాండిరగ్‌ కమిటీల సభ్యుడు2023లో కాంగ్రెస్‌లో చేరికతెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో-ఛైర్మన్‌ గా నియామకం2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి ఘనవిజయం

తుమ్మల నాగేశ్వర రావు : (రోడ్లు, భవనాల శాఖ)

ఖమ్మం నియోజకవర్గంవిద్యార్హత : డిగ్రీ1978లో రాజకీయ అరంగేట్రంఎమ్మెల్యే : 1985, 1994, 1999, 2009, 2014, 2023అనుభవం: భారీనీటి పారుదల, చిన్ననీటి పారుదల శాఖ, రోడ్లు భవనాలు, మహిళా శిశు సంక్షేమం, ఆబ్కారీ శాఖ2014లో టీఆర్‌​ఎస్‌​లో చేరిక2015లో ఎమ్మెల్సీ

దనసరి అనసూయ (సీతక్క) : (గిరిజన సంక్షేమ శాఖ)

ములుగు నియోజకవర్గంవిద్యార్హతలు: పీహెచ్‌డీ1996 వరకూ మావోయిస్టుగా అడవి జీవితంరాజకీయ అరంగేట్రం: 2004లో తెదేపాలో చేరికఎమ్మెల్యే: 2009, 2018, 20232017లో కాంగ్రెస్‌లో చేరికఏఐసీసీ మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి

కొండా సురేఖ : (స్త్రీ, శిశు సంక్షేమ శాఖ)

నియోజకవర్గం వరంగల్‌ తూర్పువిద్యార్హత: బీకాంరాజకీయ అరంగేట్రం : 1995లో మండల పరిషత్‌ ప్రెసిడెంట్‌ఎమ్మెల్యే: 1999, 2004, 2009, 2023అనుభవం: మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి2014లో టీఆర్‌​ఎస్‌​లో చేరిక2018లో తిరిగి కాంగ్రెస్‌ గూటికి

పొన్నం ప్రభాకర్‌ : (బీసీ సంక్షేమ శాఖ)

హుస్నాబాద్‌ నియోజకవర్గంవిద్యార్హతలు : ఎంఏ, ఎల్‌ఎల్‌బీఎంపీ: కరీంనగర్‌ 2009-14అనుభవం: ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,ఆంధ్రప్రదేశ్‌ మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌

కోమటిరెడ్డి వెంకట్‌​రెడ్డి : (పురపాలక శాఖ)

నల్గొండ నియోజకవర్గంవిద్యార్హతలు : సివిల్‌​ ఇంజినీరింగ్‌

ఎంపీ : భువనగిరి 2019ఎమ్మెల్యే : నాలుగు సార్లు 1999, 2004, 2009, 2014

అనుభవం : ఎన్‌​ఎస్‌​యూఐ విద్యార్థి నాయకుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !