Jeevan Reddy : మాజీ ఎమ్మేల్యే లీలలు అన్నీ ఇన్నీ కాదయా !

0

సొమ్ము ప్రభుత్వానిది, ఆదాయం జీవన్‌రెడ్డి కుటుంబానిది. గత 10 ఏళ్ళలో అధికారం మాటున అక్రమాలకు పాల్పడ్డ మాజీ ఎమ్మేల్యే జీవన్‌రెడ్డికి కొత్త ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తోంది. ఆర్మూర్‌ గడ్డపై పదేళ్లు చక్రం తిప్పిన జీవన్‌ రెడ్డికి ఇప్పుడు సమస్యలు వెంటాడుతున్నాయి. ఇన్నాళ్లు అధికారం అడ్డుపెట్టుకుని సర్కార్‌ భూమికి ఎసరు పెట్టి, బ్యాంకులకు బురిడీ కొట్టించి దబాయించారు. కానీ, ఇప్పుడు సర్కార్‌ మారిపోయింది. సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఆర్మూర్‌లో జీవన్‌ రెడ్డి ఆటలు సాగడం లేదు. ఇంతకీ జీవన్‌ రెడ్డికి వరుసగా నోటీసులు ఎందుకు వస్తున్నాయి? ఆయన చేసిన తప్పేంటి?

మాల్‌ నిర్మాణం కోసం రూ.20 కోట్ల రుణం

ఆర్మూర్‌ లో జీవన్‌ రెడ్డి ఆడిరచిందే ఆట, పాడిరదే పాటగా సాగింది. సర్కార్‌ భూమికి లీజు పేరుతో గండికొట్టారు. పదేళ్లు అయినా పైసా కూడా చెల్లించ లేదు జీవన్‌ రెడ్డి. మాల్‌ నిర్మాణం కోసం రూ.20 కోట్ల రుణం తీసుకున్నారు. బకాయిలు ఇవ్వరు, అద్దెలు మాత్రం వదలను. కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టని ఘనుడు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ జీవన్‌ రెడ్డి అక్రమాలను తవ్వుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదేళ్లు సాగించిన జీవన్‌ రెడ్డి అక్రమాల పుట్ట పగులుతోంది. రూపాయి పెట్టుబడి లేకుండా సర్కార్‌ సొమ్ముతో జీవన్‌ రెడ్డి సాధించిన గొప్పలు కుప్పకూలిపోతున్నాయి. జీవన్‌ రెడ్డి ఆర్మూర్‌ ఎమ్మెల్యే అవ్వగానే లోకల్‌ భూములపై కన్నేశారు. ఆర్మూర్‌ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీకి చెందిన భూమిని లీజు పేరుతో తన అకౌంట్‌ లో వేసుకున్నారు. ఎకరంన్నర భూమిని 33 సంవత్సరాల అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. లీజుకు తీసుకుని పదేళ్లు అయినా పైసా కూడా చెల్లించలేదు. ఆర్టీసీ అధికారులు ఎన్నిసార్లు నోటీసులు పంపినా అధికారబలంతో జీవన్‌ రెడ్డి లైట్‌ తీసుకున్నారు.

ఆర్టీసీ స్థలం...కార్పొరేషన్‌ నుండి లోన్‌ !

లీజుకి తీసుకున్న భూమిలో చకచకా షాపింగ్‌ మాల్‌ నిర్మించారు. ఇందుకోసం స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.20 కోట్లు లోన్‌ తీసుకున్నారు. షాపులు అన్నింటినీ రెంట్‌ కు ఇచ్చేశారు. అంతా బాగానే ఉంది. కానీ, ఆర్టీసీకి లీజు డబ్బులు ఇవ్వలేదు. ఫైనాన్స్‌ కంపెనీలకు కిస్తీలు కట్టలేదు. కనీసం మాల్‌ కరెంట్‌ బిల్లు కట్టిన పాపాన పోలేదు. పదేళ్లలో ఈ మాల్‌ కరెంటు బిల్లు రెండున్నర కోట్లు పెండిరగ్‌ లో ఉందంటే.. మాజీ ఎమ్మెల్యే అధికారాన్ని ఎలా వాడుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఎగ్గొట్టిన మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి షాపుల నుంచి రెంట్లను మాత్రం ప్రతీ నెల వసూలు చేసేవారు. నయా పైసా పెట్టుబడి లేకుండా కోట్లు గడిస్తున్న నయా బిజినెస్‌మేన్‌ జీవన్‌ రెడ్డి దూకుడుకు నయా సర్కార్‌ బ్రేకులు వేసి షాక్‌ ఇచ్చింది. ఇన్నాళ్లు గులాబీ పెద్దల అండదండలతో ఆర్మూర్‌ ను జీవన్‌ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారు. కానీ, ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఇక్కడ ఎమ్మెల్యే పోస్టు ఊడిరది. అక్కడ సర్కార్‌ మారింది. కట్‌ చేస్తే జీవన్‌ రెడ్డి చేసిన తప్పుల చిట్టా బయటపడుతోంది. ఇన్నాళ్లూ చూసీచూడనట్లు ఉన్న ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మాల్‌ ముందే మైకులతో బండారం బయటపెట్టేశారు.ఇటు విద్యుత్‌ శాఖ సైతం అలర్ట్‌ అయ్యింది. రూ.2కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. పైగా మాల్‌ కు కరెంట్‌ సప్లయ్‌ నిలిపివేశార. ఇటు స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కూడా మేల్కొంది. అసలు, వడ్డీ కలిపి రూ.45కోట్లు చెల్లించాలంటూ నోటీసులు పంపింది. మొత్తానికి ఆర్మూర్‌ లో జీవన్‌ రెడ్డి అక్రమ ఆటలకు ఎండ్‌ కార్డ్‌ పడినట్లు అయ్యింది. మరి నయా సర్కార్‌ మాజీ ఎమ్మెల్యే నుంచి పాత బకాయిలు ఎలా వసూలు చేస్తుందోనని జిల్లా వాసుల్లో ఆసక్తి నెలకొంది. ఈయన అకౌంట్‌లో మరిన్ని భూమలు కబ్జా చేసిన ఆరోపణలు ఉన్నాయి. వాటిని కూడా స్వాధీనం చేసుకుని తమ భూములు తమకు అప్పగించాలని బాధితులు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !