Salaar : ఎలాంటి అంచనాలు లేకుండా...రికార్డుల దుమ్ము దులిపేలా !

0


సలార్‌ మీద విపరీతమైన అంచనాలు పెంచి, రిలీజ్‌ అనంతరం చతికిలపడేకంటే...ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాను ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా ప్లాన్‌ చేశారు ప్రశాంత్‌ నీల్‌. అందుకే ప్రమోషన్స్‌ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు మేకర్స్‌. ఇక సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులే మిగిలి ఉంది.  డిసెంబర్‌ 1న ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన ప్రశాంత్‌ నీల్‌ ఎట్టకేలకు సినిమా రిలీజ్‌కు మరో పది రోజుల ఉంది అనగా ఓ సాంగ్‌ రిలీజ్‌ చేశాడు. ఈ రెండు తప్పితే సలార్‌ రిలీజ్‌ కోసం డిసెంబర్‌లో మరో ప్రమోషనల్‌ కంటెంట్‌ బయటికి రాలేదు. ఈ విషయంలో అభిమానులు కాస్త అప్సెట్‌ అవుతున్నారు. ఇక ఇప్పుడు మరో గుడ్‌ న్యూస్‌ రాబోతోంది. సలార్‌ మేకర్స్‌ అఫిషీయల్‌గా చెప్పకపోయినప్పటికీ సలార్‌ నుంచి మరో వపర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ ట్రైలర్‌ బయటికి రానుందనే బజ్‌ గట్టిగా ఉంది. రిలీజ్‌కు వారం రోజుల ముందు ఈ ట్రైలర్‌ బయటికొచ్చే ఛాన్స్‌ ఉందని అన్నారు. ఫస్ట్‌ ట్రైలర్‌లో యాక్షన్‌ డోస్‌ కాస్త తగ్గడంతో సెకండ్‌ ట్రైలర్‌ దుమ్ములేపేలా ఉంటుందని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది కానీ లేటెస్ట్‌ అప్డేట్‌ ప్రకారం సలార్‌ యాక్షన్‌ ట్రైలర్‌ లేనట్టే అని తెలుస్తోంది. సాంగ్‌ రిలీజ్‌ చేశాం కదా ఇక చాలు అన్నట్టుగా మేకర్స్‌ ఆలోచిస్తున్నట్టున్నారు. అందుకే మరో ట్రైలర్‌ రిలీజ్‌కు రెడీగా లేరని సమాచారం. 

ప్రమోషన్‌ లేవు గురూ.

సినిమాపై మరింత బజ్‌ రావాలంటే ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ రంగంలోకి దిగాల్సి ఉంది. సలార్‌ నుంచి ప్రమోషనల్‌ కంటెంట్‌ ఇంకా బయటికి రావాల్సి ఉంది కాబట్టి.. రిలీజ్‌కు వారం రోజుల ముందైనా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేస్తారా? ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తారా? అనేది చూడాలి.కెజియఫ్‌ చాప్టర్‌ 2 ఇండియన్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఎంతటి సంచలనాలు క్రియేట్‌ చేసిందో తెలుసు కదా. ఏకంగా 1200 కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇండియన్‌ టాప్‌ 5 మూవీస్‌లో ఒకటిగా నిలిచింది కెజియఫ్‌. మరి ఇలాంటి సినిమాను తలదన్నేలా ప్రశాంత్‌ నీల్‌, సలార్‌ను తెరకెక్కిస్తున్నాడా? అంటే, ఔననే అంటున్నారు. కెజియఫ్‌ తర్వాత బిగ్‌ స్కేల్‌తో భారీ బడ్జెట్‌తో సలార్‌ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు హోంబలే ఫిలింస్‌ వారు. సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌ డిసెంబర్‌ 22న రిలీజ్‌ కాబోతోంది. ఈ క్రమంలో సలార్‌ సినిమాటోగ్రాఫర్‌ భువన గౌడ.. సలార్‌ గురించి చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. సలార్‌ ఫస్ట్‌ సినిమా ఉగ్రమ్‌ నుంచి సలార్‌ వరకు ఈయనే సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. ఈ ఇద్దరి కాంబినేష్‌న్లో వస్తున్న నాలుగో సినిమా ఇది.

కేజీఎఫ్‌ కంటే 5 రెట్లు ఎక్కువగా..

సలార్‌ కెజియఫ్‌ స్కేల్‌ కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చాడు భువన గౌడ. ‘అసలు సలార్‌కు కేజీఎఫ్‌కి సంబంధం లేదు.. ట్రైలర్‌ చూసి సినిమాను అంచనా వేయలేరు. సలార్‌లోని ఫైర్‌-లైట్‌ విజువల్స్‌ కేజీఎఫ్‌ని పోలి ఉంటాయి. కానీ కేజీఎఫ్‌ సెట్‌లో సలార్‌ షూట్‌ చేయలేదు. సలార్‌ కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆర్ట్‌ డైరెక్టర్‌ శివకుమార్‌ అండ్‌ టీమ్‌ 100 ఎకరాల్లో భారీ సెట్‌లు రూపొందించారు. అదనంగా, దండుమైలారంలో హాప్‌ కిలోమీటరు గోడ మరియు 100 ఎకరాలలో భారీ సెట్లను నిర్మించాము. నా లెక్క ప్రకారం.. సలార్‌ స్కేల్‌ కేజీఎఫ్‌ కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. టెక్నికల్‌గా వేరే లెవల్‌ అనేలా సలార్‌ను తెరకెక్కించాము.. అని చెప్పుకొచ్చాడు. మరి రోజు రోజుకి అంచనాలను పెంచేస్తున్న సలార్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !