KTR : కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇప్పుడే మొదలైంది ఆసలైన ఆట

0

కాంగ్రెస్‌ పార్టీ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టిందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ దుయ్యబట్టారు. గురువారం జరగబోయే గవర్నర్‌ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి తమకు ఇచ్చారని చెప్తారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఆవరణలోని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో కేటీఆర్‌ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రాహుల్‌ గాంధీ హామీ ఏమైందని ప్రశ్నించారు. 

ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఏమైంది

తొలి కేబినెట్‌​ భేటీలోనే ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న మాట ఏమైందని, హామీలిచ్చినపుడు ఆ సంగతి తెలియదా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏనాడు పద్దులపై చర్చ జరుగలేదని, ప్రతి ఏడాది కాగ్‌ నివేదికలు ఇస్తున్నారని, అదేవిధంగా ప్రతి ఏటా ఆడిట్‌ లెక్కలు తీస్తున్నామని ఆయన వివరించారు. తాము ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి తమకు అప్పగించారని ఇక కాంగ్రెస్‌ నేతలు చెప్తున్నారని విమర్శించారు. ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలిస్తామన్నారు. అన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే స్పష్టత ఇవ్వట్లేదని ఆక్షేపించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలని, కాంగ్రెస్‌ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాడుతాం !

ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యేలు, నేతలతో బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై సానుకూల స్పందన వస్తోందని వెల్లడిరచారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యతను నిర్వహిస్తామని ఆయన వెల్లడిరచారు.నాడు అధికారం ఇస్తే ఎంత బాధ్యతగా ఉన్నామో, నేడు ఓడిన తర్వాత కూడా అంతే బాధ్యతగా ఉంటామని కేటీఆర్‌ తెలిపారు. ఈ ఎదురుదెబ్బను పాఠంగా నేర్చుకొని, ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషించుకుంటామని తెలిపారు. అదేవిధంగా ఈ ఫలితాలపై నేతలు, కార్యకర్తలు ఎటువంటి నిరాశ పడొద్దని, ఇది పార్టీకి తాత్కాలికి బ్రేక్‌ మాత్రమేనని ధైర్యం చెప్పారు. ఈ అయిదేళ్లలో 100 శాతం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నిలుస్తామని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !