CBN : అహంకారంతో ఉంటే ఏమౌవుతుందో తెలంగాణలో చూశాం !

0

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటనకు వెళ్తున్నానని..అందుకే ఇప్పుడు సీఎం జగన్‌ హడావుడిగా బయల్దేరారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తన పర్యటన ఖరారైతే తప్ప జగన్‌లో కదలిక రాలేదని వ్యాఖ్యానించారు. మిగ్‌జాం తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు చంద్రబాబు బయల్దేరారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెనాలికి వెళ్తూ మార్గమధ్యంలో ఆగారు. రేవేంద్రపాడు వద్ద రైతులను  ఆయన పరామర్శించారు. ప్రభుత్వం ఇంతవరకు పంట నష్టం అంచనాకు రాలేదని చంద్రబాబు ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘ప్రజల కష్టాలు ఇక మూడు నెలలే. పొలాల్లో ఉండి రైతు కష్టాలు తెలుసుకోవాల్సిన మంత్రులెక్కడ? పంట నష్టపరిహారం నేను పెంచుకుంటూ వెళ్తే.. జగన్‌ తగ్గించారు. కనీసం పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతులు ధైర్యంగా ఉండాలి’’ అని అన్నారు. అనంతరం నందివెలుగు వద్ద దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించారు. 

మరో 3 నెలలే ఏపీ ప్రజల కష్టాలు !

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా స్పందించారు. మిగ్‌ జాగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీలో అహంకార ప్రభుత్వం నడుస్తోందని..అహంకారంతో ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశాం..మరో మూడు నెలల్లో ఏపీలో కూడా చూస్తాం అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌ లో మరో మూడు నెలల్లో రిపీట్‌ అవుతాయని అన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను ఎక్కడా ఒక్క తప్పు కూడా చేయలేదని అంతా చట్టప్రకారమే పనిచేశానని అటువంటి తనను ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్‌ చేశారని విమర్శించారు. చేయని తప్పుకు తాను ఎంతో క్షోభ అనుభవించానని వాపోయారు. తాను కూడా మనిషినేనని..తనకు కూడా ఓ మనస్సు ఉంటుందని కానీ చేయని తప్పుకు తాను ఇబ్బందులుకు గురయ్యాయనని జైల్లో ఉన్న ఘటనలను గుర్తు చేసుకున్నారు. తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందని అది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అని అన్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వం అన్యాయం చేస్తే ప్రశ్నించటం తప్పుకాదన్నారు. అలా ప్రశ్నించినందుకు తనను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని ఇంత అహంకారంతో వ్యవహరిస్తే తెలంగాణలో జరిగిందే ఏపీలో రిపీట్‌ అవుతుందని అన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !