Ration Cards : కొత్త రేషన్‌ కార్డులకు నూతన మార్గదర్శకాలు !

0

  • రేషన్‌ కార్డుతో పాన్‌, ఆధార్‌ అనుసంధానం !
  • ఆదాయపన్ను చెల్లింపుదారులకు రేషన్‌ కట్‌ !
  • 3.5 ఎకరాలు దాటిన వారు అనర్హలు !

కొత్త రేషన్‌ కార్డుల జారీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. గతంలో మాదిరిగానే మీసేవ ద్వారానే దరఖాస్తు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి దరఖాస్తు విధానం, నిబంధనలపై సాఫ్ట్‌వేర్‌లో కీలక మార్పులు చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగా మీసేవ సాఫ్ట్‌వేర్‌ను పర్యవేక్షిస్తున్న నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)కు పౌరసరఫరాల శాఖ లేఖ రాసినట్టు తెలిసింది. దరఖాస్తులను మీసేవలోనే వడపోసే విధంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, చేర్పులు చేయనున్నట్టు సమాచారం. 

ఆస్తులు, భూములు, ఐటీ చెల్లింపు ఉంటే

దరఖాస్తుదారు ఆధార్‌, పాన్‌కార్డును లింక్‌ చేసి దరఖాస్తు సమయంలోనే ఆ వ్యక్తికి, అతడి కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ తెలిసేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందులో నిబంధనలకు మించి ఆస్తులు, భూములు, ఐటీ చెల్లింపు వంటివి ఉంటే వెంటనే ఆ దరఖాస్తును తిరస్కరించేలా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే గతంలో అందరి నుంచి దరఖాస్తులు తీసుకునేవారు. ఆ తర్వాత వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఐటీ శాఖ ఆధ్వర్యంలో 360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌తో వడపోసే వారు. ఇందులో మిగిలిన వారికి రేషన్‌ కార్డులను జారీ చేసేవారు. ఇప్పుడు మాత్రం ఆదిలోనే దరఖాస్తులను స్క్రూటినీ చేసేలా చర్యలు చేపట్టినట్టు తెలిసింది. భూ పరిమితిని 3.5 ఎకరాలుగా నిర్ణయించినట్టు సమాచారం. కొత్త దరఖాస్తులను రైతుబంధు వివరాలతో సరిపోల్చే అంశంపైనా అధికారులు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 27వ తేదీన నిబంధనలతోపాటు మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 90.40 లక్షల రేషన్‌ కార్డులుండగా, ఇందులో 2.86 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కొత్తగా సుమారు 10 లక్షల వరకు దరఖాస్తులు ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు వీటితోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !