CM REVIEW MEETING : విద్యుత్‌ అధికారులతో సిఎం సమావేశం...ప్రభాకర్‌రావు గైర్హజరు !

0

తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో విద్యుత్‌ శాఖపై సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ శాఖ సమీక్షలో విద్యుత్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ సునీల్‌ శర్మ, సింగరేణి సిఎండి శ్రీధర్‌, విద్యుత్‌ శాఖ జేఎండి శ్రీనివాసరావు, ఎస్పీడిసియేఎల్‌ సిఎండి రఘుమారెడ్డి, ఎన్పిడీసీఎల్‌ సిఎండి గోపాల్‌ రావు, విద్యుత్‌ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలుపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఉన్నతాధికారులు ఇస్తున్నారు. 2014 జూన్‌ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్‌ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వివరాలు స్పష్టంగా ఇవ్వాలని తెలిపారు. ఈ  సమీక్షకు ఇప్పటికే రాజీనామా చేసిన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు హాజరు కాలేదు. ఆయన రాజీనామాను ఆమోదించవద్దని, సమీక్షకు ప్రభాకర్‌రావు హాజరయ్యేలా చూడాలని గురువారం విద్యుత్‌ శాఖ కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు సమీక్షకు గైర్హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు సీఎండీ ప్రభాకర్‌ రావు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోనే వున్న ప్రభాకర్‌ రావు ఈరోజు రివ్యూకు హాజరు కాలేదు. దీంతో సీఎం ఈరోజు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో తెలుపాలని అన్నారు. నిన్నటి నుంచి విద్యుత్‌ శాఖ అంశంపై సీఎం సీరియస్‌ గా వున్నారు.

200 లోపు యూనిట్లు ఉచితం కోసం రివ్యూ 

విద్యుత్‌ శాఖలో డిస్కంలకు ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. దీంతో అసలు శాఖలో ఏం జరుగుతోందన్న కోణంలో సీఎం అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడే వారికి ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ అమలు కోసమే విద్యుత్‌ శాఖ వ్యవహారాలపై పూర్తి అవగాహన కోసం సీఎం సమగ్ర రివ్యూ జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయినా కూడా ప్రభాకర్‌ రావు సమీక్షకు హాజరు కాలేదు. ప్రభాకర్‌ రావు ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. అయినా సమీక్షకు గైర్హాజరు కావడంతో సీఎం ఏవిధంగా స్పందించనున్నారు అనేదానిపై స్పష్టత రానుంది. మరోవైపు ఆర్టీసీ శాఖలపై సీఎం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ కమిషనర్‌ వాణి ప్రసాద్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ఆర్టీసీ ఈడీలు, ఉన్నతధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం సెక్రటేరియట్‌ కు సీఎం రేవంత్‌, పలువురు మంత్రులు సహా ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఆర్టీసీ తరువాత విద్యుత్‌ శాఖపై రివ్యూ నిర్వహించారు. 

ఆర్టిసి ఎండి సజ్జనార్‌తో సమీక్ష

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ అంశంపై ఆర్టిసి ఎండి సజ్జనార్‌ తో చర్చించారు సీఎం. ఇప్పటికే కర్ణాటక వెళ్లి ఉచిత ప్రయాణంపై ఆర్టిసి అధికారుల అధ్యయనం చేశారు. ఆర్టీసీ ఆదాయ, వ్యయాలపై సీఎం సమీక్షలో ఆరా తీశారు. రేపటి నుంచి ప్రారంభించనున్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీపై సమీక్షలో ఆర్టీసీ అధికారులకు సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణాశాఖ త్వరలో పూర్తి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 12 నుంచి 13 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై రోజుకు రూ.4 కోట్ల దాకా భారం పడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.   

నన్ను పిలవలేదు.. సీఎండీ ప్రభాకర్‌రావు 

విద్యుత్‌ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష వ్యవహారంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పందించారు. సీఎం సమీక్ష గురించి తనకు సమాచారం లేదని, తనను సమీక్షకు ఎవరూ పిలవలేదని  ప్రభాకర్‌రావు మీడియాకు చెప్పడం గమనార్హం. ముఖ్యమంత్రి పిలిస్తే సమీక్షకు ఎందుకు వెళ్లనని ఆయన ప్రశ్నించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !