Who is Next Cm : కాబోయే సిఎం రేవంత్‌రెడ్డి ?

0

కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సీఎల్పీ) సమావవేశంలో సోమవారం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటామని డీకే శివకుమార్‌ తెలిపారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరాతమన్నారు. గచ్చిబౌలిలోని హోటల్‌ ఎల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచిన  ఎమ్మెల్యేలలతో సమావేశం అనంతరం బయటికి వచ్చిన డీకే మీడియాతో మాట్లాడారు. గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బృందం అందజేయనుంది. హోటల్‌ నుంచి గవర్నర్‌ను కలవడానికి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, పార్టీ ఇంఛార్జ్‌ థాక్రే, డీకే శివకుమార్‌, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెళ్లారు.

సీఎం ఎవరన్నది ఫైనల్‌ కాలేదు : ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి 

సీఎం ఎవరన్నది ఫైనల్‌ కాలేదని, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాతే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. సీఎం ఎవరనేది ఏఐసీసీలో ఇంకా నిర్ణయం కాలేదన్నారు. సీఎల్పీ సమావేశం సోమవారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారా.. లేదంటే  వివిధ గ్రూపు రాజకీయాలు బయటపడి నిర్ణయం వాయిదా పడుతుందా అనేది చూడాలి.

సీఎల్పీ మీటింగ్‌లో ఏమి జరిగే అవకాశం ఉంది ? 

గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్‌ పార్టీలో సీఎల్పీలో అభ్యర్థుల నుండి అభిప్రాయ సేకరణ జరుగనుంది. సేకరణ సమయంలో కాంగ్రెస్‌ సీనియర్లు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, భట్టి విక్రమాక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలా ఎవరి అనుచరులు ఆయా అభ్యర్థులను సూచించే అవకాశం ఉంది. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి వేరే పార్టీ నుండి వలస వచ్చిన నాయకుడిగా కార్నర్‌ చేసే అవకాశం ఉంది. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీనే నమ్ముకుని, కష్టమైనా నష్టం అయినా కాంగ్రెస్‌ పార్టీ విధేయులకే సిఎం పీఠం దక్కాలని కోరే అవకాశం ఉంది. ఈ సమయంలో నాయకులంతా భట్టి విక్రమార్క నాయకత్వాన్ని బలపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

రేవంత్‌ రెడ్డి వర్సెస్‌ భట్టి విక్రమార్క !

అవునన్నా కాదన్నా కాంగ్రెస్‌ పార్టీని తన భుజస్కందాలపై మోసిన ఒకేఒక్కడు రేవంత్‌ రెడ్డి, తను రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న రాష్ట్రమంతా తన నియోజకవర్గంగా భావించి హెలికాప్టర్‌లో 50 కి పైగా సభల్లో తిరిగారు. సీనియర్‌ నాయకులు ఉన్నా ఎవరి నియోజకవర్గ పరిథిలో వాళ్ళే పరిమితమైన సందర్భంలో పార్టీ కోసం అన్నీ ఒక్కడై నడిపించాడు, కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించారు. కమిట్‌మెంట్‌తో 100 కి 100% కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసమే పాటుపడ్డారు. రేవంత్‌ దూకుడు, సందర్భోచితంగా మాట్లాడే తీరు ఒక విలక్షణ నాయకుడిగా నిలబెట్టాయి.  ఇక ప్రజల్లోనూ రేవంత్‌ రెడ్డే సిఎం అని ఫిక్సపోయారు. ఇక భట్టి విక్రమాక్రకు విషయానికి వస్తే సౌమ్యుడు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో ఈయనకు హైకమాండ్‌ దగ్గర మంచి పేరుంది. కాంగ్రెస్‌నే అంటి పెట్టుకుని తన పోరాటాన్ని సాగించారు. ఈయన్ని సిఎం అభ్యర్థి కాదనడానికి ఒక్క అంశమూ లేదు. 

రేవంత్‌రెడ్డి సిఎం ? డిప్యూటీ సిఎంగా భట్టి ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 64 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఈమేరకు ప్రమాణ స్వీకారోత్సవానికి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ నుంచి ముగ్గురు కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ ముఖ్యనేతలంతా హాజరయ్యే అవకాశముంది. కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ఉదయం సీఎల్పీ నేతను ఎన్నుకోనుంది. ఇందుకోసం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సమావేశం ఏర్పాటు చేయగా.. గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. ఏఐసీసీ పరిశీలకుల ఆధ్వర్యంలో సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియ సాగనుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !