Hyderabad CP : డ్రగ్స్‌ ముఠాలకు దమ్కీ !

0

హైదరాబాద్‌ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొదటిసారి శ్రీనివాస్‌ రెడ్డికి ప్రాధాన్యత గల పోస్టింగ్‌ వచ్చింది. గతంలో ఆయన గ్రే హౌండ్స్‌ అక్టోపస్‌లో పనిచేశారు. నూతన సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డికి ముక్కుసూటి అధికారిగా మంచి పేరు ఉంది. ఇవాళ ఉదయం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో హైదరాబాద్‌​ సీపీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీనివాస్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామని, డ్రగ్స్‌ ముఠాలను సహించేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ ముఠాలకు ఈ రాష్ట్రంలో చోటులేదని హెచ్చరించారు. పబ్స్‌, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్‌ యజమానులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఈ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం చెప్పారన్నారు.

సమన్వయంతో పనిచేస్తాం..మత్తు ముఠాల ఆటకట్టిస్తాం !

నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్‌​ రెడ్డికి ధన్యవాదాలు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అందరు అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేస్తాను. ప్రభుత్వం అన్నివిధాలా పోలీసులకు సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. 450 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ మత సామరస్యానికి పెట్టింది పేరు, దానిని కాపాడుతాం. ముఖ్యంగా సినీ రంగంలో డ్రగ్స్‌ వినియోగం ఉన్నట్లు తెలుస్తోందని ఆయన వెల్లడిరచారు. డ్రగ్స్‌ వినియోగం లేకుండా సినిమా పెద్దలు చూడాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా విషయంలో అన్ని వర్గాలతో పాటు సినిమా పెద్దతో కూడా సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉంటుందని, ఉల్లంఘించే వారితో కఠినంగా ఉంటామని చెప్పారు. ఉద్దేశపూర్వక నేరాలు చేసేవారితో చాలా కరకుగా ఉంటామని స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !