Revanth Reddy : తొలి హామీ నెరవేర్చబోతున్న రేవంత్‌రెడ్డి...

0

తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేపు రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. రేవంత్‌ రెడ్డి తొలి సంతకం దేనిపై చేస్తాడు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు ఫైల్‌ మీద తొలి సంతకం చేయాలని నిర్ణయించారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీ అనే మరుగుజ్జు అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ గ్యారంటీ కార్డుపై సంతకం చేసి తొలి హామీ ఇచ్చారు. ఇప్పుడు తానే స్వయంగా ముఖ్యమంత్రిగా రజినీకి తొలి ఉద్యోగం ఇస్తూ.. రేవంత్‌ సంతకం చేయబోతున్నారు. కాంగ్రెస్‌ పై తనకున్న నమ్మకంతోనే రేవంత్‌ రెడ్డిని కలిసి తన సమస్యను చెప్పుకున్నానని రజినీ తెలిపింది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిందని.. తనకు ఉద్యోగం రాబోతుందని అంటోంది. అయితే తొలి ఉద్యోగం తనదే కావడంపై రజినీ సంతోషం వ్యక్తం చేసింది.

సామాన్యుడి ప్రభుత్వంగా

ఈ క్రమంలో రేపు ప్రమాణస్వీకారం అనంతరం.. వికలాంగురాలు రజినీకి మొదటి ఉద్యోగంపై రేవంత్‌ మొదటి సంతకం చేయనున్నారు. అందుకోసం.. ఏర్పాటు చేయాలని అధికారులకు రేవంత్‌ ఆదేశం ఇచ్చారు. ఎన్నికలకు ముందు అక్టోబర్‌ 17 న గాంధీ భవన్‌లో రేవంత్‌ను కలిసింది రజినీ. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని ఎంఏ వరకు చదువుకున్నానని..చదువు పూర్తి అయ్యాక తాను ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదని..ప్రైవేటు సంస్థలు కూడా తనకు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాలేదని ఆమె రేవంత్‌ తో చెప్పుకుని వాపోయారు. ఉద్యోగం లేక ఎంతో కష్టపడుతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె బాధను అర్థం చేసుకుకున్న రేవంత్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ఉద్యోగం ఇచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రమాణస్వీకారం రోజునే రజనీకి ఉద్యోగం కల్పించే ఫైల్‌ పై సంతకం చేయనున్నారు.  ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. దీంతో.. రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి రజనీని రావాలని రేవంత్‌ రెడ్డి ఆహ్వానం పంపారు. రేపు ఎల్బీ స్టేడియంలో రజనీ ఉద్యోగ నియామక ఫైల్‌ మీద రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సంతకం చేయనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !