KCR In Yashodha Hospital : కేసీఆర్‌కు హిప్‌రీప్లేస్‌మెంట్‌ సర్జరీ !

0

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాత్రి ఫామ్‌హౌస్‌లో కాలు జారి పడ్డారు. రాత్రి రెండున్నర గంటల సమయంలో బాత్‌రూమ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన కాలికి గాయమైంది. వెంటనే హుటాహుటిన యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన తుంటి ఎముకకు గాయమైంది. కేసీఆర్‌ గాయంపై యశోద ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రమాదం ఏమీ లేదని తెలిపాయి. ఆయనకు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ చేయాలని పేర్కొన్నాయి. ఈ రోజు సాయంత్రం డాక్టర్లు హిప్‌రీప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయనున్నారు. కేసీఆర్‌ ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలు, బీఆర్‌ఎస్‌ అభిమానులు కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ అంటే ఏంటి?

హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ అనేది హిప్‌ జాయింట్‌ అరిగిపోయిన లేదా దెబ్బతిన్న భాగాలను ఆర్టిఫిషియల్‌ ఇంప్లాంట్‌లతో రీప్లేస్‌ చేసే ప్రక్రియ. హిప్‌ ఆర్థరైటిస్‌ వల్ల కలిగే తుంటి నొప్పి, స్టిఫ్‌నెస్‌ నుంచి ఉపశమనం పొందేందుకు నిర్వహిస్తారు. ఈ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు బాధపడుతున్నారు. తీవ్రమైన తుంటి నొప్పి, స్టిఫ్‌నెస్‌రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. మందుల ద్వారా ఉపశమనం పొందకపోతే తుంటిని రీప్లేస్‌ చేయాల్సి ఉంటుంది.

కేసీఆర్‌కు హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ: హరీశ్‌ రావు

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఈ మేరకు యశోద ఆస్పత్రి వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. అనుమతి లేనందున కార్యకర్తలు ఎవరూ ఆస్పత్రి వద్దకు రావొద్దని, కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తారని చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌ ఉన్నారని, కార్యకర్తలు ఆందోళన పడొద్దన్నారు. ఇవాళ సాయంత్రం కేసీఆర్‌కు వైద్యులు హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయనున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని హరీశ్‌ రావు అన్నారు. సర్జరీ సమయంలో ఇన్ఫెక్షన్స్‌ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎవ్వరూ ఆస్పత్రికి రావద్దని కోరుతున్నానని తెలిపారు. కేసీఆర్‌కు విశ్రాంతి అవసరమన్నారు. కసీఆర్‌ను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ ఆస్పత్రికి రావద్దని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదానికి పెద్ద శస్త్రచికిత్స అవసరమవుతుందని తెలిపారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని బీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులతో పాటు ప్రార్థిస్తున్నామని తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు కేసీఆర్‌ ఆరోగ్యంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. కేసీఆర్‌ గాయం గురించి విని చాలా బాధపడ్డానని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !