Mallareddy : గిరిజనుల భూముల కబ్జా... మల్లారెడ్డిపై కేసు నమోదు !

0

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గిరిజనులకు సంబంధించిన 47 ఎకరాల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారంటూ శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. మల్లారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గంగా రామ్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిష్టర్‌ చేసినట్లు పోలీసులు వెల్లడిరచారు. గిరిజనులకు చెందిన భూమిని తమ పేరు మీద బలవంతంగా రాయించుకునేందుకు ప్రయత్నం చేసిన మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అలాగే ఈ వ్యవహారానికి సహకరించిన శామీర్‌పేట్‌ తహశీల్దార్‌ పై సైతం కేసు నమోదు అయ్యినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

ఎస్సీ, ఎస్టి, అట్రాసిటీ కేసు నమోదు

మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టి, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. భూ కబ్జాకు సంబంధించి బాధితురాలు ఫిబ్రవరిలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డికి చెందిన రెండు ఆస్పత్రుల మధ్యలో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతరుల భూమిని ఆక్రమించడమే కాకుండా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి మంత్రి, తమ ల్యాండ్‌లోకి తమనే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు అందటంతో పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా..గతంలో కూడా మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి. ఈక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమిపాలయ్యాక మరోసారి భూకబ్జా ఆరోపణలో కేసు నమోదు కావటం గమనించాల్సిన విషయం. ఈ ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !