- తల్లిదండ్రులారా..బోగస్ స్కాలర్‌షిప్‌ల పట్ల పారాహుషార్ !
- రూ.300 కోట్లు స్కాలర్‌షిప్ ప్రకటించిన ఫిడ్జి
- ఫీజులతోనే కోట్లు దండుకునే వ్యూహం
- ఫిడ్జిలో చేరిన విద్యార్థులకే అంటూ మెలిక
- పరీక్షల అనంతరం 300 కోట్లు స్కాలర్‌షిప్ అందించిన వివరాలు ప్రకటించగలరా?
డబ్బు (స్కాలర్‌షిప్ పేరుతో ) ఎర వేసి డబ్బును సంపాదించటం ఎలానో మన కార్పొరేట్ విద్యాసంస్థలకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అంటే నమ్ముతారా ? ఇప్పుడు ప్రత్యక్షంగా చూడండి. ఫిడ్జి పరీక్ష వ్రాయండి, 300 కోట్ల స్కాలర్‌షిప్ పొందండి. ఈ ఒక్క ప్రకటన చాలు ఎంతో మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పరుగులు పెట్టడానికి. తమ లక్ ఎలా ఉందో పరిశీలించుకోవడానికి పోటీపడుతుంటారు. ఇక్కడే తప్పులో కాలు వేస్తున్నారు. డబ్బులు ఊరికే ఎవరైనా ఇస్తారా ? అని మాత్రం ఆలోచంచటం లేదు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని ఒక పెద్దాయన పదే పదే చెప్తున్నా ఎవరూ వినటం లేదు. కానీ ఇప్పుడు ఆలోచించండి. ఫీజుల కోసం తల్లిదండ్రుల్ని జలగల్లా పీల్చే కార్పొరేట్ విద్యాసంస్థలు రూ. 300 కోట్లు స్కాలర్‌షిప్ ఇస్తున్నాయి అంటే ఎలా నమ్ముతున్నారు. హలో సార్ ...మిమ్మల్నే. ఎలా నమ్ముతున్నారు.
ఆకర్షించటం...ఆపై మభ్యపెట్టడం !
ముందుగా రూ. 300 కోట్లు అని భారీ ప్రకటనలకు తెరతీస్తారు. తల్లిదండ్రుల ఆశలపై ఆకర్షణ వల విసురుతారు. పరీక్ష వ్రాయిస్తారు, సెలక్ట్ కాలేదు అని చిన్న కారణం చూపి మీ డేటాను తస్కరిస్తారు. ఇది కార్పొరేట్ విద్యాసంస్థల నయా దోపిడీ దందా స్టైల్. ఈ దందా కోసం కొత్త రూటును కనిపెట్టారు. దీని కోసం సోషల్ మీడియాను భారీగా వాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారి కోసం పదే పదే ప్రకటనతో ఆకర్షించేలా ప్రకటనలు నడుపుతోంది. విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మభ్యపెడుతోంది ఫిట్జి విద్యాసంస్థ. డిసెంబర్ 24 నుండి జనవరి 7 వరకు 300 కోట్ల స్కాలర్‌షిప్ అంటూ విద్యార్థుల ఫ్రీ సమయాన్ని బట్టి టైమ్‌ని కేటాయించేలా స్లాట్‌ల విధానాన్ని రూపుదిద్దింది ఫిడ్జి విద్యాసంస్థ. పైకి స్కాలర్‌షిప్ టెస్ట్ మాత్రమే, కానీ దీని వెనుక పెద్ద తతంగమే నడుస్తుంది. దేశవ్యాప్తంగా టాటెంటెడ్ స్టూడెంట్స్ యొక్క వివరాలను వెతికి పట్టుకోవటమే ఈ స్కాలర్‌షిప్ ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం. ఫిడ్జి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు కాకుండా ఇతర విద్యాసంస్థల్లోని టాలెంటెడ్ స్టూడెంట్స్ వివరాలు సేకరించేందుకు వేసిన వలే ఈ ఫిడ్జి టాలెంట్ రివార్డ్ ఎగ్జామ్. స్కాలర్‌షిప్ కోసం ఆశపడి ఫిడ్జి స్కాలర్‌షిప్ రాశారా...అంతే. మీ వివరాలు మొత్తం లాగేసుకుంటుంది ఫిడ్జి. దేశవ్యాప్తంగా ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ స్కూల్స్‌లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారో వారి వివరాలు సేకరిస్తుంది. ఆ డేటాను ఉపయోగించి ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి ఫిడ్జి హాస్టల్స్‌లో ఉచిత విద్యను ఆఫర్ చేయటం దగ్గర నుండి వేరే ఇతర ప్రోత్సాహకాలు ఆశచూపి తమ విద్యాసంస్థల్లో చేరేలా మభ్యపెట్టటమే ఈ స్కాలర్‌షిప్ వెనుక ఉన్న అసలు లక్ష్యం. ఎందుకంటే బాగా టాలెంటెడ్ విద్యార్థులు రాబోయే రోజల్లో నీట్, జెఈఈ అడ్వాన్స్‌డ్ లాంటి ఎగ్జామ్స్‌లో 10 లోపు ర్యాంకు సాధిస్తే సంస్థ తలరాతే మారిపోతుంది. ఒక్క ర్యాంకు సాధిస్తే చాలు వేలాది అడ్మిషన్లు వచ్చేస్తాయి. గత సంవత్సరం ఫిడ్జి ఫలితాలను తీసుకుంటే జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్ వంటి ఎగ్జామ్స్‌లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 100 లోపు మంచి ర్యాంకులను సాధించింది. ఆ ర్యాంకులతోనే ఇప్పుడు మార్కెటింగ్ చేసుకుంటోంది. ఫిడ్జిలో చదివితే ఫస్ట్ ర్యాంకు వస్తుంది అని నమ్మిస్తోంది. కేవలం కొద్ది మంది ర్యాంకులు చూపి వందలు, వేలల్లో విద్యార్థులను సంస్థల్లో చేర్పించుకుంటున్నారు. అసలు ర్యాంకులు రాని వారు ఎందరో ఉన్నారు. కానీ వారి వివరాలు మాత్రం ఎక్కడా ప్రచురించరు. ఫిడ్జి సంస్థలో చదివే ప్రతి విద్యార్థికి ఆలిండియా ఫస్ట్ ర్యాంకు వస్తుందా ? కనీసం 100 లోపు ర్యాంకైనా వస్తుందా ? ఫిడ్జి గ్యారెంటీ ఇవ్వగలదా ? పేరెంట్స్ ఎందుకు ఆలోచించటం లేదో వారికే తెలియాలి. ఎందుకంటే తమ పిల్లాడికి మంచి ర్యాంకు వస్తుందేమోనని ఆశ. అదే ఆశే ప్రైవేటు విద్యాసంస్థలకు వరంగా మారింది. కాసుల వర్షం కురిపిస్తోంది.
కండీషన్స్ చూడండి, దిమ్మతిరుగుతుంది.
రూ.300 కోట్ల స్కాలర్‌షిప్ ఇవ్వటం అనేది ఒక ఫేక్ ప్రామిస్. ఒకవేళ వేరే సంస్థలో చదువుతూ ఫిడ్జి టాలెంట్ రివార్డ్ ఎగ్జామ్‌లో మంచి ఫలితం వచ్చినా ప్రయోజనం దక్కదు. ఎందుకంటే ఫిడ్జి సంస్థలో అడ్మిషన్ తీసుకున్న వారికే మాత్రమే ఆ ప్రయోజనం వర్తిస్తుంది. కావలంటే నిశితంగా గమనించండి రూ. 300 కోట్ల వద్ద స్టార్ మార్క్‌తో షరతులు వర్తిస్తాయి అని ఉంటుంది. ఆ షరతులు అన్నీ ఫిడ్జి సంస్థకు అనుకూలంగా ఉంటాయి. చివరికి మోసపోతున్నది విద్యార్థులే. ప్రతిభావంతులని గుర్తించటం, వారిని తమ సంస్థల్లో చేర్చుకోటం. ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ దగ్గర నుండి సరాసరిన 150/` వరకు వసూలు చేసి అదనంగా కోట్లు కొల్లగొడుతున్నారు. టెస్ట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కొద్ది మొత్తంలో నగదు, ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు వంటి చిన్న చిన్న బహుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రిజల్ట్ రోజున సారీ...మీ పిల్లవాడు అర్హత సాధించలేదు అని చిన్న మేసేజ్‌తో బెటర్‌లక్ నెక్ట్ టైమ్ అంటున్నారు. అక్కడితో ఆగుతుందా అంటే అదీ లేదు. ఫిడ్జిలో చేరండి, టాప్ ర్యాంకులు సాధించండి అంటూ మార్కెటింగ్ వాళ్ళు బయలు దేరుతారు. కావాలంటే ఫీజులో కన్సెషన్స్ ఇస్తాం అంటూ మభ్యపెడుతూ తల్లిదండ్రుల వెంటపడటం, అడ్మిషన్ల సంఖ్య పెంచుకోవటం, కోట్లు వెనకేసుకోవటం ఇదే ఫిడ్జి టాలెంట్ రివార్డ్ ఎగ్జామ్ వెనుక ఉన్న ఫిడ్జి విద్యాసంస్థ దూరలోచన.