కరువు సీమలో కాసుల పంట పండబోతోంది. నా రాయలసీమ రతనాల సీమ అని ఓ కవి అసువుగా అన్న అది నిజం కాబోతోంది. వర్షాలు కురిస్తే వజ్రాలు వెలికివచ్చే నేలలో, ఇప్పుడు బంగారు గనులు బయటపడుతున్నాయి. రాయలసీమ కరువు ప్రాంతంలో కర్నూలు జిల్లా కూడా ఒకటి. ఈ ప్రాంతమంతా ఎటు చూసినఏతైనా కొండలు గుట్టలే దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో భూగర్భ జలాలు కూడా తక్కువే. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది అతి తక్కువశాతం వర్షపాతం నమోదు కావడంతో జలాశయంలోని నీటి నిలువలు కూడా అడగంటి పోయిన పరిస్థితి. అలాంటి కరువు నెలలో బంగారం లభ్యం అవ్వడం ఇప్పుడు రాష్ట్రామంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి తదితర ప్రాంతాల్లో వర్షం కురిస్తే చాలు ఆ ప్రాంతంలో వజ్రాల వేట కొనసాగుతూ ఉంటుంది. ఒక్క జిల్లా వాసులే కాకుండా అటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వజ్రాల వేటకోసం అన్వేషిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు కొత్తగా ఎక్కడ చుసిన బంగారం మాటే వినబడుతుంది.
బంగారు నిక్షేపాలు
ఈ ప్రాంతంలో విశేషంగా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. బంగారం వెలికి తీసేందుకు ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేయాలని జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రభుత్వ అనుమతులు పొందింది. ఎకరా రూ.12 లక్షల చొప్పున 300 ఎకరాలు కొనుగోలు చేయాలని రైతులతో ఒప్పందం చేసుకొని కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వీటికి సంబంధించి జొన్నగిరిలో పూర్తి తవ్వకాలు ప్రారంభించినట్లు డెక్కన్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్ ( Gణవీూ ) తెలిపింది.బంగారం తవ్వకాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు పొందామని ఈ కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం తుగ్గలి ప్రాంతంలో 1.5 టన్నుల మట్టిలో 10.5 గ్రాముల బంగారు లభ్యమవ్వగా ఇక్కడే మట్టి శుద్దికేంద్రానికి పూర్తి స్థాయిలో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. ఇది మొదలైతే ఏడాదికి 750 కిలోల బంగారాన్ని వెలికితీయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం మరో బంగారు నిక్షేపాలు ఆస్పరి మండలంలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆస్పరి మండలంలో బంగారు మైన్స్ ఉన్నట్లు జియోలాజికల్ సర్వేఆఫ్ ఇండియా గుర్తించినట్లు సమాచారం.త్వరలోనే ఇక్కడ ఎంతమేరా బంగారం లభ్యమవుతుంది ఇక్కడ తవ్వకాలు జరిపితే లాభదాయాకమాలేదా అనే దానిపై అధికారులు దీనిపై కేంద్రానికి నివేదిక పంపనున్నారు.ఏది ఏమైనా కరువు ప్రాంతంలో కనక మహాలక్ష్మిలా వజ్ర వైడ్యుర్యాలు, బంగారు లభించడం అనేది విశేషంగా మారింది.
ఐతే ఇక మనం రాయలసీమను స్వర్ణసీమ అనీ రత్నసీమ అనీ అందాం.
రిప్లయితొలగించండి