TS Govt : హైద్రాబాద్‌ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి !

0

తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఐపీఎస్‌ (IPS) అధికారుల బదిలీలు జరిగాయి. రాచకొండ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ( Revanth Reddy) బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్‌ బదిలీలకు మొదటిసారి శ్రీకారం చుట్టారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్‌ (IPS) అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో కమిషనర్లను బదిలీ చేస్తూ రేవంత్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నూతన సీపీగా కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి ( KOTHAKOTA SRINIVASAREDDY)నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సీపీగా సుధీర్‌ బాబు (SUDHEER BABU) సైబరాబాద్‌ సీపీగా అవినాష్‌ మహంతి (AVINASH MAHANTHI) నియమితులయ్యారు. అలాగే హైదరాబాద్‌ పాత సీపీ సందీప్‌ శాండిల్యాను తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో డైరక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, రాచకొండ సీపీ చౌహన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !