Silk Smitha : అందమైన (సిల్క్‌ స్మిత) స్వప్నం ...చిదిమేసిన కాలం !

0

ఒకప్పుడు సినీపరిశ్రమలో సిల్క్‌ స్మిత లేడీ సూపర్‌ స్టార్‌. దాదాపు 450కి పైగా సినిమాల్లో నటించి స్టార్‌ డమ్‌ అందుకుంది. కానీ అంతలోనే ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. మత్తెక్కించే కళ్లు.. అందచందాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఆమె కోసమే ప్రతి సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉండేలా చూసుకునేవారు దర్శకనిర్మాతలు. సిల్క్‌ డేట్స్‌ కోసం స్టార్‌ హీరోస్‌ సైతం ఎదురుచూసేవారు. స్టార్‌ హీరోహీరోయిన్లకు మించి పారితోషికం తీసుకున్న ఏకైక నటి. అయితే తెరపై అందచందాలతో ప్రేక్షకులకు కవ్వించిన సిల్క్‌ .. జీవితం మాత్రం కన్నీటి చెర. చిన్న వయసులోనే పెళ్లి.. ఇంట్లో కష్టాల నుంచి పారిపోయి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మేకప్‌ ఆర్టిస్ట్‌ అయ్యింది. ఆ తర్వాత నటిగా మారింది. హీరోయిన్‌ కావాలనుకుంది కానీ కుదరలేదు. తక్కువ సమయంలోనే ఊహించని పేరు, డబ్బు, హోదా సంపాదించి కేవలం 36 ఏళ్ల వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ప్రేమ, నమ్మకం చేతిలో మోసపోయి చివరకు ఒంటరితనంతో పోరాడి ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు (డిసెంబర్‌ 2న) సిల్క్‌ స్మిత జయంతి.

అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి

సిల్క్‌ స్మిత.. 1960 డిసెంబర్‌ 2న ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా, దెందులూరు మండలంలోని కొవ్వలి గ్రామం లో జన్మించింది. ఆమె అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. ఇంటి పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో కేవలం నాల్గవ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. బాల్యం మొత్తం కష్టాలతోనే గడిపింది. చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. కానీ అక్కడ తనకు కష్టాలు వదల్లేదు. భర్త, అత్తమామలు పెట్టే బాధను భరించలేక ఇంట్లో నుంచి పారిపోయి చెన్నై చేరుకుంది. అక్కడ తనకు వరుసకు అత్తయ్య అయ్యే మహిళతో నివసించింది. నటి కావాలనే కోరికతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో హీరోయిన్లకు మేకప్‌ ఆర్టిస్ట్‌ గా పనిచేసింది.

సినిమా జీవితం 

టచ్‌ అప్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ ను మొదలుపెట్టిన స్మితకు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేయటం మొదలుపెట్టారు.ఆంథోనీ ఈస్ట్‌మన్‌ దర్శకత్వం వహించిన మలయాళ సినిమా ఇనాయె తేదిలో హీరోయిన్‌ గా నటించారు. ఆంథోనీనే స్మిత అనే పేరును ఇచ్చారు. తమిళ డైరెక్టర్‌ విను చక్రవర్తి ద్వారా తమిళ సినీ ప్రపంచంలో మంచి అవకాశాలను పొందారు. విను చక్రవర్తి యొక్క భార్య స్మిత కు ఇంగ్లీష్‌ మాట్లాడటం మరియు డాన్స్‌ చేయటం నేర్పించారు. అందంగా మరియు ఆకర్షణీయంగా ఉన్న స్మిత క్యాబరే డాన్సర్‌ గా మరియు నెగటివ్‌ రోల్స్‌ లలో నటించటం ప్రారంభించారు. 1979 లో విడుదల అయిన సినిమా వండిచక్రం సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ సినిమా తరువాత స్మితకు మంచి గుర్తింపు లభించింది. ఫలితంగా ఆ సినిమాలో తన పాత్ర పేరు అయిన సిల్క్‌ ను నిజజీవితంలో కూడా ఉపయోగించటం మొదలుపెట్టారు. ఇలా విజయలక్ష్మి వడ్లపాటి నుంచి సిల్క్‌ స్మితగా మారింది. ఈ సినిమాలో తన పాత్ర మంచి ఆదరణ పొందటం మరియు సినిమా హిట్‌ కావటంతో తన మిగతా కెరీర్‌ కూడా స్మిత అలాంటి పాత్రలనే చేయటం కొనసాగించారు. స్మిత క్రమ క్రమంగా తమిళ్‌ , తెలుగు, మలయాళం, కన్నడ మరియు కొన్ని హిందీ సినిమాలలో నటించటం ప్రారంభించారు. సిల్క్‌ స్మిత చేసిన ఐటెం సాంగ్స్‌ మరియు బోల్డ్‌ యాక్టింగ్‌ కారణంగా సౌత్‌ సినిమా ప్రపంచంలో ఒక గ్లామర్‌ తార గా వెలిగిపోయారు. సినిమాలకు రివ్యూలు ఇచ్చే కొంత మంది సిల్క్‌ స్మిత ను సాఫ్ట్‌ పోర్న్‌ నటి అని అన్నారు. తాను చేసిన చాలా సినిమాలలో బికినీలు ధరించటం మరియు అందాలను ప్రదర్శించటం కారణంగా ఆ రోజులలో అలాంటి సినిమాలను సాఫ్ట్‌కోర్‌ మూవీస్‌గా పరిగణించేవారు. సిల్క్‌ స్మిత రొమాంటిక్‌ పాత్రలే కాకుండా కొన్ని సినిమాలలో మంచి నటనను కూడా చేసి క్రిటిక్స్‌ చేత ప్రశంసలు అందుకున్నారు.1989 లో నటించిన లాయనం అనే శృంగారభరిత డ్రామా సినిమా భారతదేశ అడల్ట్‌ ఇండస్ట్రీ లో చాలా పాపులర్‌ అయ్యింది. హిందీ లో ఇదే సినిమా  రేష్మకి జవానీ అనే పేరు తో రిలీజ్‌ అయ్యింది. ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుని ఊహించని స్టార్‌ డమ్‌ అందుకుంది. తన మ్యాజిక్‌ నటనతో సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీని షేక్‌ చేసింది. అప్పట్లో సిల్క్‌ లేకపోతే సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్‌ సైతం ముందుకు రాలేదంటే ఆమె క్రేజ్‌ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కేవలం 17 ఏళ్ల వయసులోనే దాదాపు 450కి పైగా సినిమాల్లో నటించింది. సహాయ నటిగా కాకుండా స్పెషల్‌ సాంగ్స్‌ చేసి అలరించింది. కేవలం సిల్క్‌ స్మితను చూసేందుకే అప్పట్లో అడియన్స్‌ థియేటర్లకు వచ్చేవారు. హీరోయిన్‌ కావాలనుకున్న స్మిత కల మాత్రం కలగానే మిగిలిపోయింది. ఆమెకు ఎక్కువగా స్పెషల్‌ సాంగ్స్‌ ఆఫర్స్‌ మాత్రమే వచ్చేవి.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు స్టార్‌ హీరోస్‌ అందరి సినిమాల్లో నటించింది సిల్క్‌. 

మరణం 

కానీ 90లో స్మితకు అవకాశాలు తగ్గిపోయాయి. మరోవైపు తన చుట్టూ ఉన్నవాళ్లు సిల్క్‌ డబ్బును తీసుకోవడం.. ప్రేమించిన మనిషి మోసం చేయడంతో మానసికంగా కుంగిపోయింది. ఒకవైపు అవకాశాలు రావటం తగ్గిపోయాయి. మరోవైపు నిర్మాతగా మారి రెండు సినిమాలు నిర్మించింది. కానీ ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద విఫలం కావడంతో అప్పులు పెరిగిపోయాయి. ఓవైపు ప్రేమ మోసం మానసిక క్షోభ.. మరోవైపు అప్పులు పెరగడంతో ఆమె డిప్రెషన్‌‏లోకి వెళ్లిపోయింది. చనిపోయే ఒక రోజు ముందు కూడా తన స్నేహితురాలు మరియు డాన్సర్‌ అయిన అనురాదాకు కాల్‌ చేసారు. అనురాధ బిజీ గా ఉండటం వల్ల సిల్క్‌ స్మిత ను కలవలేకపోయారు. చివరకు తన మనసులోని బాధను నోట్‌ రాసి 1996 సెప్టెంబర్‌ 23న చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్‌ కు ఉరివేసుకుని చనిపోయింది. సూసైడ్‌ నోట్‌లో రాసిన విషయాలు సరిగా లేకపోవటం వల్ల అర్థం చేసుకోవటం కష్టమైంది. పోస్టుమార్టం తరవాత సిల్క్‌ స్మిత సూసైడ్‌ ద్వారా చనిపోయిందని మరియు చనిపోయే ముందు ఎక్కువగా మద్యం సేవించారని తెలిసింది. కానీ సిల్క్‌ సూసైడ్‌ చేసుకోలేదని.. హత్య చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరికొందరు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందని అన్నారు. సిల్క్‌ మరణించి 27 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆమె మరణంపై అనుమానాలు మాత్రం వీడలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !