Mahua Moitra : టీఎంసీ ఎంపీ మహువా లోక్‌సభ సభ్యత్వం రద్దు !

0

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు గాను డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడిరది. ఈ వ్యవహారంపై పార్లమెంట్‌ నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది. ‘‘ఎంపీ మహువా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ చేసిన తీర్మానాన్ని ఈ సభ అంగీకరించింది. అందువల్ల ఆమె ఇక ఎంపీగా కొనసాగడం తగదు’’ అని స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడిరచారు. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. ఆమెను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

నిర్థారించిన ఎథిక్స్‌ కమిటీ !

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని, ఆమె పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలను దుబాయ్‌ నుంచి యాక్సెస్‌ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, లోక్‌సభలో ప్రధాని మోడీ, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీపై ప్రశ్నలకు అడిగేందుకు మహువా మొయిత్రా డబ్బులు తీసుకున్నారని, అలాగే కాన్ఫిడెన్షియల్‌ అయిన ఎంపీ లాగిన్‌ ఐడీ పాస్‌ వర్డ్‌లను వేరేవాళ్లకు ఇచ్చినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే లోక్‌ సభ స్పీకర్‌కు కంప్లైంట్‌ చేశారు.  ఆమెపై వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికను శుక్రవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే, న్యాయవాది జై అనంత్‌ దెహద్రాయ్‌ (మహువా మాజీ మిత్రుడు)ను కమిటీ విచారించింది. అనంతరం 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు కమిటీ నిర్ధారించింది.అనంతరం ఆమెను బహిష్కరించాలని డిమాంండ్‌ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తీర్మానాన్ని పెట్టారు. అయితే, ఈ తీర్మానాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసేందుకు తమకు కొంత సమయమివ్వాలని, నివేదికపై ఓటింగ్‌కు ముందు సభలో చర్చ జరపాలని టీఎంసీ సహా పలువురు విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు.

మహువాకు అనుమతి నిరాకరణ..

ఈ క్రమంలోనే నివేదికపై కొంతసేపు చర్చించేందుకు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతినిచ్చారు. ఈ క్రమంలోనే అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. అయితే, ఈ చర్చలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మహువా కోరగా.. సభాపతి అందుకు నిరాకరించారు. అనంతరం మూజువాణీ ఓటింగ్‌ ద్వారా.. ఈ నివేదికను లోక్‌సభ ఆమోదించింది. అనంతరం మహువాను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్‌.. సభను వచ్చే సోమవారానికి (డిసెంబరు 11) వాయిదా వేశారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. ఓటింగ్‌ సమయంలో విపక్షాలు వాకౌట్‌ చేశాయి.

మా ఇంటికి సీబీఐ వస్తుందేమో: మహువా

తన బహిష్కరణను మహువా తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఎథిక్స్‌ కమిటీ ప్రతి నిబంధనను ఉల్లంఘించింది. మమ్మల్ని అణగదొక్కేందుకు ఈ కమిటీని ఓ ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు చెప్పిన మాటలను నమ్మి నన్ను దోషిగా నిర్ధారించారు. ఇక, రేపు మా ఇంటికి సీబీఐని పంపించి నన్ను వేధిస్తారేమో’’ అని మహువా మండిపడ్డారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !