Ravi Uppal : దుబాయ్‌లో మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ యజమాని అరెస్ట్‌ !

0


దేశంలో ఇటీవల కలకలం సృష్టించిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ మనీలాండరింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ యాప్‌ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్‌ జారీ చేసిన రెడ్‌ కార్నర్‌ నోటీసు ఆధారంగా అతడిని దుబాయ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు బుధవారం వెల్లడిరచాయి. రవి ఉప్పల్‌ను గత వారమే అదుపులోకి తీసుకున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు దుబాయి అధికారులతో ఈడీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపాయి. ఇక మరో యజమాని సౌరభ్‌ చంద్రఖర్‌ కోసం కూడా దుబాయ్‌ పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.

ఏంటీ బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారం..

ఛత్తీస్‌గఢ్‌లోని భిలాల్‌ ప్రాంతానికి చెందిన రవి ఉప్పల్‌, సౌరభ్‌ చంద్రఖర్‌ దుబాయ్‌ కేంద్రంగా భారత్‌లో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో వీరు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కోల్‌కతా, భోపాల్‌, ముంబయి వంటి తదితర నగరాల్లో సోదాలు నిర్వహించగా.. రూ. వందల కోట్లలో అక్రమ నగదు బయటపడిరది. బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్‌ ఖాతాలకు తరలించేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ గుర్తించింది.

రవి ఉప్పల్‌కు వనౌటు దేశ పాస్‌పోర్ట్‌

ఈ కేసులో ఈడీ ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేసింది. రవి ఉప్పల్‌కు వనౌటు దేశ పాస్‌పోర్ట్‌ ఉందని, దాన్ని ఉపయోగించి అతడు పలు దేశాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని దర్యాప్తులో తేలినట్లు ఈడీ పేర్కొంది. అయితే, అతడు భారత పౌరసత్వాన్ని వదులుకోలేదని, దీనిపైనే ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. ఇక, ఈ యాప్‌ మరో ప్రమోటర్‌ అయిన సౌరభ్‌ చంద్రశేఖర్‌ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఈఏలో ఘనంగా జరిగింది. ఇందుకు రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు ఈడీ గుర్తించింది. అతడి పెళ్లికి బాలీవుడ్‌లోని ప్రముఖ సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో వెల్లడిరచింది. ఈ కేసులో రవి ఉప్పల్‌, సౌరభ్‌ చంద్రఖర్‌పై  నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఆ తర్వాత ఈడీ అభ్యర్థన మేరకు వీరిద్దరిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. అయితే, ఈ మనీలాండరింగ్‌ ఆరోపణలను రవి ఉప్పల్‌, సౌరభ్‌ చంద్రశేఖర్‌లు ఖండిరచారు. మహదేవ్‌ యాప్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, దాన్ని శుభమ్‌ సోని అనే వ్యక్తి నడిపిస్తున్నాడని చెప్పారు. మరోవైపు, ఈ బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారంలో ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌పైనా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్‌ ప్రమోటర్లు బఘేల్‌కు రూ.508 కోట్లు చెల్లించినట్లు క్యాష్‌ కొరియర్‌ ఆసిమ్‌ దాస్‌ తన వాంగ్మూలంలో చెప్పాడని ఈడీ ఆరోపించింది. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆసిమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.5కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ డబ్బును తనకు శుభమ్‌ సోని ఇచ్చాడని ఆసిమ్‌ చెప్పినట్లు ఈడీ వెల్లడిరచింది. కాగా.. ఆ తర్వాత అతడు మాట మార్చినట్లు సమాచారం. అధికారులు తమతో బలవంతంగా ఆ వాంగ్మూలంపై సంతకం చేయించినట్లు ఆసిమ్‌ ఆ మధ్య జైలు అధికారికి లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !