Rash Driving : పంజాగుట్ట ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌ !

0

పంజాగుట్ట ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్‌ అలియాస్‌ రహేలిని ప్రధాన నిందితుడిగా పోలీసులు చేర్చారు. అబ్దుల్‌ ఆసిఫ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి బారీకెడ్లను ఢీ కొట్టింది సోహెల్‌ అని పోలీసులు తేల్చారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే ఇంట్లో డ్రైవర్‌ని లొంగిపోవాల్సిందిగా సోహెల్‌ మొదటగా ఆదేశించాడు. సోహెల్‌ ఆదేశాలతో పోలీస్‌ స్టేషన్‌లో అబ్దుల్‌ ఆసిఫ్‌ లొంగిపోయాడు. అబ్దుల్‌ ఆసిఫ్‌ని అరెస్టు చేసి పంజాగుట్ట పోలీసులు రిమాండ్‌కి పంపారు. అర్ధరాత్రి సమయంలో అత్యంత వేగంగా వచ్చి ట్రాఫిక్‌ బారీకెడ్స్‌ని సోహెల్‌ ఢీ కొట్టాడు. సోహెల్‌తో పాటు కారులో నలుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలతో కలిసి అర్ధరాత్రి సమయంలో లాంగ్‌ డ్రైవ్‌కి సోహెల్‌ బయలుదేరాడు. పంజాగుట్ట వద్ద ప్రమాదం జరగానే మరొక కారుని తెప్పించుకొని సోహెల్‌ అక్కడ నుంచి పారిపోయాడు. పారిపోయిన సోహెల్‌ కోసం పంజాగుట్ట పోలీసులు గాలిస్తున్నారు. 17 సెక్షన్లు కింద సోహెల్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసును తారుమారు చేసిన పోలీసులు 

పంజాగుట్ట ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసు విచారణలో పోలీసుల నిర్వాకం బయట పడుతోంది. ప్రమాదం తర్వాత సోహైల్‌ను కానిస్టేబుళ్లు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సోహైల్‌ను అదుపులోకి తీసుకోవడంతో పోలీస్‌ స్టేషన్‌కు మాజీ ఎమ్మెల్యే షకీల్‌ వచ్చారు. సోహైల్‌ బదులు షకీల్‌ ఇంట్లో పని మనిషిని పోలీసులు కేసులో చేర్చారు. సీసీ కెమెరాలో షకీల్‌ దృశ్యాలు రికార్డు అయ్యాయి. సీఐ, నైట్‌ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్రపై విచారణ కొనసాగుతోంది. సోహైల్‌తో రాత్రి ఫోన్‌ మాట్లాడిన స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు.

పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావుకు అస్వస్థత

పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావుకు అస్వస్థత రావడంతో కేర్‌ ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు వ్యవహారంలో సీఐ పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. దీంతో దుర్గారావు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో ఆయనను హుటాహుటిన బంజారా హిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1 లోని కేర్‌ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. కేర్‌ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో వైద్యులు దుర్గారావును పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !