Salaar : సలార్‌లో ప్రభాస్‌ది లేట్‌ ఎంట్రీనా ?

0

సినిమా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డార్లింగ్‌ ప్రభాస్‌ ట్రైలర్‌​ రానే వచ్చింది. వచ్చిన కొద్ది నిమిషాల్లోనే కొన్ని వేల వ్యూస్‌తో, లైక్స్‌​తో షేక్‌​ చేసింది. ‘సలార్‌​’ మీద ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి అలాంటిది మరి. టీజర్‌ ఇచ్చిన అంచనాలతో ట్రైలర్‌​పై బోలెడు ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్‌​కు ఫలితం బాగానే దక్కింది. Please I Kindly Request ....! అంటూ ప్రభాస్‌​ మాస్‌​ ర్యాంపేజ్‌​.. పృథ్వీరాజ్‌​ యాక్టింగ్‌ ఇలా ప్రతి ఒక్కటి ఆడియెన్స్‌​ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ప్రభాస్‌​సు కూడా ఈ మూవీ మంచి కమ్‌​ బ్యాక్‌​ ఇచ్చేలా ఉందని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరోవైపు డైరెక్టర్‌ ప్రశంత్‌​ నీల్‌ తన మార్క్‌​ను ఈ సినిమాలో స్పష్టంగా చూపించినట్లు ట్రైలర్‌ చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. విజువల్స్‌​ నుంచి స్టార్ల ఎంపిక వరకు అన్నింటి విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రభాస్‌ ఎంట్రీ లేట్‌గా...

మూడున్నర నిమిషాల ట్రైలర్‌ లో ప్రభాస్‌ రెండున్నర నిమిషం తర్వాత కనిపించాడు. ఆ తర్వాత ప్రభాస్‌ ర్యాంపేజ్‌ని ప్రశాంత్‌ నీల్‌ మాస్‌గా చూపించాడు అది వేరే విషయం కానీ ట్రైలర్‌లో లేట్‌ గా కనిపించిన ప్రభాస్‌ సలార్‌ సినిమాలో ఎప్పుడు కనిపిస్తాడు అనేది ఇప్పుడు ప్రేక్షకుల మదిని తొలిచేస్తోంది. తన ఫ్రెండ్‌ అయినా పృధ్వీరాజ్‌ సుకుమారన్‌ సమస్యలో ఉన్నప్పుడు ఆదుకునే పవర్‌ఫుల్‌ పాత్ర ప్రభాస్‌ చేసిన అప్పటిదాకా ప్రభాస్‌ ఎంట్రీ ఉండదా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. అలాగే అయితే ప్రభాస్‌ ఎంట్రీ సినిమాలో కూడా లేట్‌గా వస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌కి హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ అయితే, ఆయన్ని ఆదుకునే పాత్రలో ప్రభాస్‌ ఎంట్రీ లేట్‌గా జరిగి, సెంకండ్‌ పార్ట్‌లో తన స్నేహితుడిని చంపిన వారిపై రీవేంజ్‌ తీర్చుకునేలా ప్రభాస్‌ మెయిన్‌ లీడ్‌గా మారే అవకాశం లేకపోలేదని విశ్లేషిస్తున్నారు. సలార్‌ సినిమాలో ప్రభాస్‌కి ఫ్రెండ్‌ గా, ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేస్తున్నాడు పృథ్వీ రాజ్‌ సుకుమారన్‌. మలయాళంలో సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ ఉన్న పృథ్వీ పాన్‌ ఇండియా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అలాంటి హీరోని తీసుకోని వచ్చి ప్రశాంత్‌ నీల్‌ చిన్న క్యారెక్టర్‌ అయితే ఇచ్చి ఉండడు, పైగా జగపతి బాబు ఈ సినిమాలో నటించింది ఏడు రోజుల పాటే. సో జగపతి బాబు ఎక్కువ సేపు ఉండడు కానీ పృథ్వీ రాజ్‌ స్క్రీన్‌ పైన చాలా సమయం కనిపిస్తాడు. ఉగ్రమ్‌ సినిమాలో కూడా హీరోతో సమానంగా హీరో ఫ్రెండ్‌ రోల్‌ ఉంటుంది. క్యారెక్టర్స్‌ ని ఇంట్రడ్యూస్‌ చేసి, పృథ్వీ రాజ్‌-జగపతి బాబుల ఎంట్రీ తర్వాత ప్రభాస్‌ ఇంట్రడక్షన్‌ ఉంటే అప్పటికే చాలా సమయం అయిపోతుంది. ప్రభాస్‌ ని చూడడానికి థియేటర్స్‌ కి వెళ్లే అభిమానులు అంత సేపు ఓపికగా కూర్చుంటారా అనేది చూడాలి. ప్రశాంత్‌ నీల్‌ కూడా ఇలాంటి రిస్క్‌ తోసుకోని ప్రభాస్‌ ని లేట్‌ గా స్క్రీన్‌ పైకి తీసుకోని రాకపోవచ్చు. ప్రభాస్‌ పైన చేసిన సినిమా కాబట్టి ప్రభాస్‌ ఎక్కువ సమయమే కనిపిస్తాడు అనడంలో సందేహం లేదు. అయితే పార్ట్‌ 2 ఉంది కాబట్టి ప్రభాస్‌ ని లేట్‌ గా ఇంట్రడ్యూస్‌ చేసి సీజ్‌ ఫైర్‌ ఎండ్‌ లో ప్రభాస్‌ ఫాథర్‌ క్యారెక్టర్‌ ని తీసుకోని వస్తే మాత్రం సినిమా స్టార్టింగ్‌ లో ఏం జరిగినా ఆడియన్స్‌ పెద్దగా పట్టించుకోక పోవచ్చు. మరి ప్రశాంత్‌ నీల్‌ ఏం ప్లాన్‌ చేసాడు? ప్రభాస్‌ ని పృథ్వీరాజ్‌ ప్రపంచంలోకి ఎంత త్వరగా తెస్తాడు అనేది చూడాలి.

114 రోజుల్లో షూటింగ్‌ పూర్తి !

అయితే ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను ప్రశాంత్‌ నీల్‌.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడిరచారు.’సలార్‌’ను తెరకెక్కించాలన్న ఆలోచన ఆయనకు 15 ఏళ్ల క్రితమే వచ్చిందని.. అయితే తన తొలి సినిమా ‘ఉగ్రమ్‌’ తర్వాత ఆయన ‘కేజీఎఫ్‌’ చిత్రీకరణలో బిజీ అయిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో 8 ఏళ్ల తర్వాత ‘సలార్‌​’ను పట్టాలెక్కించారని వెల్లడిరచారు. ఇక ‘సలార్‌’ సినిమాను భారత్‌​లోని వివిధ ప్రాంతాల్లో షూట్‌​ చేసినట్లు తెలిపారు. అందులో ఎక్కువ భాగం హైదరాబాద్‌​లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిందని.. ఆ తర్వాత సింగరేణి గనులు, వైజాగ్‌, మంగళూరు ఓడరేవుల్లో కొంత భాగాన్ని చిత్రీకరించినట్లు వెల్లడిరచారు. అంతే కాకుండా ఈ సినిమాలో కొంత భాగాన్ని యూరప్‌లోనూ షూట్‌​ చేశారని చెప్పారు. అలా షూటింగ్‌ మొత్తాన్ని 114 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ మాట విన్న ఫ్యాన్స్‌ షాక్‌​కు గురయ్యారు.. అంత పెద్ద సినిమాను ఇంత తక్కువ సమయంలో ఎలా చిత్రీకరించారని ఆశ్చర్యపోతున్నారు. మూవీ టీమ్‌ బలంగా ఉండటం వల్లే ఇది సాధ్యపడుతుందని సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉంటాయని సమాచారం. దీంతో ఫ్యాన్స్‌​ నిరాశ చెందుతున్నారు.

సినిమా సంగతేంటి?

‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సలార్‌’. ఇద్దరు ప్రాణ స్నేహితులు.. బద్ధ శత్రువులైతే ఎలా? అనే లైన్‌తో మూవీ తీసినట్లు స్వయంగా ప్రశాంత్‌ నీలే చెప్పాడు. అక్టోబరు 28న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అలా డిసెంబరు 22 అని డేట్‌ ఫిక్స్‌ చేశారు.

ట్రైలర్‌ ఎలా ఉంది?

‘సలార్‌’ టీజర్‌ లో ప్రభాస్‌ ముఖం చూపించకుండా ఎలివేషన్‌ ఇచ్చారు. ట్రైలర్‌తో మాత్రం దాదాపు అందరూ మెయిన్‌ లీడ్స్‌ని చూపించేశారు. ట్రైలర్‌ చివరలో ప్రభాస్‌ కనిపించాడు. యాక్షన్‌ తో అదరగొట్టేశాడు. ఆ ఫైట్‌ సీన్స్‌ అన్నీ వేరే లెవల్‌ హై ఇస్తున్నాయి. రవి బస్రూర్‌ సంగీతం అలరిస్తోంది.  ఓవరాల్‌గా ట్రైలర్‌ చూస్తుంటే ఈసారి థియేటర్లలో దుమ్మరేగ్గొట్టేలా గ్యారంటీ. అలానే బాక్సాఫీస్‌కి బ్యాండ్‌ కూడా పక్కా అనిపిస్తోంది.

సలార్‌’ కథేంటి?

ఖన్సార్‌ అనే ప్రాంతాన్ని రాజమన్నార్‌(జగపతిబాబు) అనే వ్యక్తి ఏలుతుంటాడు. ఇతడి కొడుకు వరద రాజమన్నార్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌). అయితే రాజమన్నార్‌ పనిమీద బయటకెళ్లినప్పుడు.. అతడి కొడుకుని అంతమొందించి, ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని కొందరు ప్లాన్‌ చేస్తుంటాడు. దీంతో వరద రాజమన్నార్‌, తన చిన్నప్పటి ఫ్రెండ్‌ దేవా (ప్రభాస్‌) సహాయం తీసుకుంటాడు. చివరకు ఏమైంది? అనేదే ‘సలార్‌’ పార్ట్‌ 1 స్టోరీ అనిపిస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !