AP : చంద్రబాబుతో ప్రశాంత్‌కిషోర్‌ భేటీ...వైసీపీకి వెన్నుపోటేనా ?

0

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో పొత్తుల ఖరారు, సీట్ల సర్దుబాట్లతో పాటు అధికార పార్టీని ఓడిరచడానికి వ్యూహరచనలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ వైసీపీ తరఫున ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆనాటి ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయసాధించగా టీడీపీ 23 సీట్లకే పరిమితం అయ్యింది. జనసేన పార్టీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు ఒక్క సీటు కూడా గెలవలేక పోయాయి. అనంతరం జగన్‌, కిషోర్‌ మధ్య దూరం పెరగడంతో ఏపీ రాజకీయాల వైపు పీకే దృష్టిని సారించలేదు. శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయంలో నారా లోకేశ్‌తో కలిసి ప్రశాంత్‌ కిషోర్‌ కనిపించారు. అనంతరం వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ప్రశాంత్‌ కిషోర్‌తోపాటు షో టైమ్‌ కన్సల్టెన్సీ పేరిట తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్‌ శర్మ టీమ్‌ సభ్యులు సైతం చంద్రబాబుతో సమావేశమయ్యారు.

కీలక అంశాలు ప్రస్తావించిన ప్రశాంత్‌ కిషోర్‌?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ల మధ్య దాదాపు 3గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. జగన్‌ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఆయా వర్గాలు, అంశాల వారీగా ప్రభుత్వ బలాబలాలను పీకే వివరించినట్టు తెలుస్తోంది. ‘‘వైసీపీ ప్రభుత్వ విధానాలపై యువత తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ఉన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్యుత్‌ బిల్లులు, పన్నుల బాదుడు వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. దళితులు, బీసీలపై దాష్టీకాలు ఆయా వర్గాలను వైసీపీకి దూరం చేశాయి. ఒకరిద్దరు మినహా.. కేబినెట్‌ మంత్రులకు సున్నా మార్కులు’’ అంటూ పీకే వ్యాఖ్యానించినట్టు సమాచారం. ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని, దానికి అనుగుణంగా ప్రతిపక్షం వ్యూహరచన ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. అసంతృప్తితో ఉన్న యువతను ఆకర్షించేలా తెలుగుదేశం పార్టీ కార్యాచరణ ఉండాలని, చంద్రబాబు అరెస్టుతో న్యూట్రల్స్‌ పాటు కొంత మేర వైసీపీ వర్గాల్లోనూ జగన్‌పై వ్యతిరేకత వచ్చిందని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పినట్టు సమాచారం.దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ వ్యూహకర్తగాపీకే వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వైసీపీ వ్యూహకర్తగా పనిచేశారు. సమావేశం ముగిసిన తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రశాంత్‌ కిషోర్‌ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ‘చంద్రబాబు సీనియర్‌ నేత. అందుకే మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసేందుకు వచ్చా. దీనిపై ఎలాంటి ఊహాగానాలు వద్దు’’ అంటూ పీకే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !