Revanth Reddy : ప్రజాతీర్పు శ్రీకాంతచారికి అంకితం !

0


ఎన్నికల విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు. ఎన్నికల ఫలితాలపై మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం. మానవహక్కులను కాపాడుతాం. ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీలను నెరవేరుస్తాం. ప్రగతిభవన్‌ పేరును అంబేడ్కర్‌ భవన్‌గా మారుస్తాం. ఇక నుంచి ప్రగతి భవన్‌.. ప్రజా భవన్‌ అవుతుంది. పార్టీని విజయం వైపు నడిరచిన ఠాక్రే, ఇతర నేతలకు కృతజ్ఞతలు. కాంగ్రెస్‌ గెలుపుపై కేటీఆర్‌ స్పందను స్వాగతిస్తున్నా’’ అని రేవంత్‌  తెలిపారు. తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. అందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  కాంగ్రెస్‌ నేతలు విజయం కోసం చాలా కృషి చేశారని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని స్పష్టం చేశారు. అటు.. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రచారం బాగా జరిగింది అని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హమీలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.

అన్ని పార్టీలకు కలుపుకుపోతాం !

డిసెంబర్‌ 3వ తేదీన శ్రీకాంత్‌చారి అమరుడయ్యారు.. ఇవాళ్టి ప్రజా తీర్పు శ్రీకాంత్‌చారికి అంకితం చేస్తున్నానని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ‍ప్రజలు పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు. భారత్‌ జోడో ద్వారా రాహుల్‌ స్ఫూర్తిని నింపారని తెలిపారు. మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్‌ పార్టీ ముందుంటుందని చెప్పారు. తాను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ కలిసి పార్టీని ముందుకు నడిపిస్తామని పేర్కొన్నారు. సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌లతో కలిసి ముందుకు వెళ్తాం. భారత్‌ జోడో యాత్ర ద్వారా రాహుల్‌ స్ఫూర్తి నింపారు. సీనియర్‌ నాయకులందరి సహకారంతో కాంగ్రెస్‌ విజయం సాధించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో బీఆర్‌ఎస్‌ సహకారం అందిస్తుందని భావిస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటులో ప్రజలు భాగస్వామ్యం కావాలి. కొత్త ప్రభుత్వంలో బీఆర్‌ఎస్‌ సహకరిస్తుందని ఆశిస్తున్నాం. ప్రజాతీర్పును అందరూ శిరసావహించాలి.’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

ప్రగతి భవన్‌ పేరు మార్పు..

ప్రగతి భవన్‌ పేరును మారుస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి చెప్పారు. ప్రగతి భవన్‌ను ఇకపై డా. అంబేద్కర్‌ ప్రజా భవన్‌గా పేరు మారుస్తున్నట్లు పేర్కొన్నారు. సచివాలయం గేట్లు సదా ప్రజలకు తెరిచి ఉంటాయని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !