Salaar : అంచనాలు పెంచేస్తున్న సలార్‌ - 2

0

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘సలార్‌’ బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌​ఫుల్‌​గా రన్‌ అవుతోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వానికి, ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ యాక్టింగ్‌​కు యాక్షన్‌ ప్రియులు ఫిదా అవుతున్నారు. దీంతో భారీ కలెక్షన్లు వసూలు చేస్తుంది. మొత్తానికి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నిరీక్షణ ఫలించింది అనే చెప్పాలి. ఎందుకంటే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌​కు సరైన హిట్‌​ పడలేదు. అంతేకాకుండా అభిమానులు కోరుకున్న విధంగా కూడా ఏ సినిమా రాలేదు. దీంతో ‘సలార్‌’ సినిమా చూసిన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. వింటేజ్‌​ ప్రభాస్‌​ను మళ్లీ చూడగలుగుతున్నామంటూ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు.

మరింత ఆసక్తికరంగా పార్ట్‌ 2

ప్రభాస్‌ కటౌట్‌​, ఇమేజ్‌​కు తగ్గట్టుగా ‘సలార్‌’ సినిమాను డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ రూపొందించారు. స్టోరీ పరంగా అంతంత మాత్రంగా ఉందంటున్నప్పటికీ ఎలివేషన్స్‌, యాక్షన్‌​ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని ఫ్యాన్స్‌ అభిప్రాయపడున్నారు. దీంతో ఈ సినిమాకు మాస్‌ ప్రేక్షకులు, అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇంతవరకు ఓకే కానీ కొన్ని విషయాల్లో మాత్రం ప్రశాంత్‌ నీల్‌ మెప్పించలేకపోయారని అని అంటున్నారు. హీరో క్యారెక్టర్‌ గ్రాఫ్‌​ సరిగాలేదని, ఇద్దరి మిత్రుల మధ్య స్నేహం, పగ రెండు సరిగా చూపించలేకపోయారంటూ మూవీ లవర్స్‌ అంటున్నారు. ఇక స్టోరీని అయితే కొంచెం గందరగోళంగా నడిపించారని ఇలా చాలా విషయాల్లో కన్ఫ్యూజన్‌​లో పెట్టేశారని టాక్‌ వినిపిస్తోంది. అయితే వీటిన్నంటికి సమాధానంగా ‘సలార్‌’ సెకండ్‌ పార్ట్‌ ఉంటుందంటూ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇక ఫస్ట్‌ పార్ట్‌​లో కనిపించిన జగపతిబాబు పాత్ర కూడా రెండో భాగంలో హైలెట్‌​ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇక ‘శౌర్యాంగ పర్వం’ అంటూ ఆసక్తకిరమై టైటిల్‌​తో సెకండ్‌​ పార్ట్‌ను ప్రకటించారు డైరెక్టర్‌. ప్రాణ స్నేహితులు ఎందుకు శత్రువులుగా మారారు అనే విషయంపైనే ఈ స్టోరీ నడవనుందని సమాచారం. దీంతో ‘సలార్‌’ ఫస్ట్‌ పార్ట్‌ కంటే రెండో భాగం ఇంకా బాగుంటుందంటూ విశ్లేషకులు అంటున్నారు. అలా అభిమానుల్లో ఈ పార్ట్‌​ 2 మీద భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. పేరు కూడా వినేందుకు కొత్తగా ఉన్నందున ఫ్యాన్స్‌ కూడా ఈ సినిమా అఫీషియల్‌​ అనౌన్స్‌​మెంట్‌​ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

రికార్డు కలెక్షన్స్‌ 

తాజాగా ‘సలార్‌’ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు కలెక్షన్స్‌ రూ.175 కోట్లు అని సినీ ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారానే రూ. 90 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలుస్తోంది. ఈ ఏడాదిలో మొదటిరోజు బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ ఇచ్చిన చిత్రంగా ‘సలార్‌’ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకు భారత్‌లో మొదటిరోజు అత్యధిక ఓపెనింగ్స్‌ కలెక్షన్స్‌ అందుకున్న చిత్రంగా ‘ఆర్‌​ఆర్‌​ఆర్‌’​ మాత్రమే ఉంది. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్‌ రూ.223 కోట్ల రికార్డ్‌ పదిలంగా ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్‌-2 రూ.165 కోట్ల రికార్డ్‌ను ‘సలార్‌’ దాటేశారు. దీంతో మొదటిరోజు బిగ్గెస్ట్‌ కలెక్షన్స్‌ సాధించిన చిత్రాల జాబితాలో ‘సలార్‌’ రెండో స్థానానికి చేరుకుంది. ఈ రెండు చిత్రాలు సౌత్‌ ఇండియా నుంచే ఉండటం విశేషం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !