Awards : సంతోషం అవార్డ్స్‌ ఫంక్షన్‌లో కన్నడ నటులకి అవమానం !

0

తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే ‘సంతోషం అవార్డ్స్‌’ వేడుక ఈసారి మరింత ఘనంగా జరిగింది. ప్రముఖ పాత్రికేయుడు సురేష్‌ కొండేటి అందిస్తున్న 22వ ‘సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ ఈవెంట్‌ డిసెంబర్‌ 2న గోవాలో కన్నుల పండుగగా జరిగింది. అయితే ఈ వేడుకలో కన్నడ నటులకు అవమానం జరిగిందని వార్తలు గుప్పుమన్నాయి. అవార్డులు ప్రదానం చేస్తున్న సమయంలో సడెన్‌గా లైట్స్‌ ఆపేసి వేదిక నుంచి వెంటనే వెళ్లిపోవాలని అవమానించారని సమాచారం. ఈ విషయం గురించి ప్రముఖ కన్నడ జర్నలిస్ట్‌ శారద తన ట్వీట్‌ చేసింది. అంతేకాదు ఈ వేడుక కోసం గోవా వచ్చిన రమేష్‌ అరవింద్‌, సప్తమి గౌడ, రాగిణి ద్వివేదితో పాటు పలువురు కన్నడ నటీనటులు స్టే చేసిన హోటల్‌ బిల్లులను నిర్వహకులు చెల్లించలేదని రాసుకొచ్చింది. దీంతో హోటల్‌ యాజమాన్యం రూమ్‌లను లాక్‌ చేయడంతో నటీనటులందరూ చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారట. చివరకు పోలీసుల జోక్యంతో హోటల్‌ నుంచి బయటపడగలిగారని శారద తెలిపింది. కాగా ప్రజంట్‌ ఇందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఒక్కరు చేసిన తప్పుకు ఇండస్ట్రీని నిందించొద్దు...అల్లు అరవింద్‌.

ప్రముఖ పాత్రికేయుడు సురేష్‌ కొండేటి ప్రతి ఏడాది ‘సంతోషం అవార్డుల’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాడు. ఈవెంట్‌కు హాజరైన కన్నడ సెలబ్రిటీలకు చేదు అనుభవం ఎదురైందని వార్తల సారాంశం. కన్నడ నటులను అవమారించారని, కనీసం రూమ్‌ బిల్లులు కూడా కట్టకుండా ఇబ్బంది పెట్టారంటూ కన్నడ ప్రతినిధులు, మీడియా ‘సంతోషం అవార్డు’ వేడుక మీద విమర్శలు చేస్తూ టాలీవుడ్‌ను తప్పుబడుతున్నారు. దీంతో ఈ వివాదంపై అల్లు అరవింద్‌ రియాక్ట్‌ అయ్యారు. తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన దీని గురించి మాట్లాడుతూ.. ‘ఎవరో ఒకరు చేసిన దానికి మొత్తం టాలీవుడ్‌ను నిందించడం కరెక్ట్‌ కాదు. తెలుగు చిత్ర పరిశ్రమపై విమర్శలు చేయడం నాకు ఎంతో బాధగా అనిపిస్తుంది. అతను ఎవరికీ పీఆర్వో కాదు.. మాకు మా కుటుంబానికి పీఆర్వో కాదు’ అంటూ సీరియస్‌ అయ్యాడు అల్లు అరవింద్‌. కాగా.. ఈ వివాదంపై ఇంకెంత మంది సినీ ప్రముఖులు రియాక్ట్‌ అవుతారో వేచి చూడాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !