Nizamabad: ఒకే కుటుంబంలో 6 గురు హత్య...ఆస్థి కోసమే !

0


వరుస హత్యలతో నిజామాబాద్‌ జిల్లా  ఉలిక్కిపడిరది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. 15 రోజుల వ్యవధిలో వారందరూ మర్డర్‌ అయ్యారు. వారందరిని హత్య చేసింది ఒకే ఒక్కడు. వాడే సైకో కిల్లర్‌ ప్రశాంత్‌. పక్కా ప్లాన్‌ ప్రకారం.. ఎవరికీ అనుమానం రాకుండా ఒకరి తర్వాత ఒకరినీ వరుస హత్యలతో కుటుంబాన్ని కడతేర్చాడు. మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పారేశాడు. సదాశివనగర్‌ లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసుని సవాల్‌ తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేశారు. తీగ లాగితే డొంక కదిలింది. బాల్కొండ సోన్‌ బ్రిడ్జి సమీపంలో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. మాచారెడ్డిలో మరొకరి డెడ్‌ బాడీ లభించింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తేలడంతో పోలీసులు షాక్‌ కి గురయ్యారు. మృతులను ప్రసాద్‌, అతడి భార్య, ఇద్దరు పిల్లలు, ప్రసాద్‌ సోదరీమణులు ఉన్నారు. ప్రసాద్‌ తల్లి మాత్రమే ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, వారు కనిపించకుండా పోయినా.. ఎక్కడా మిస్సింగ్‌ కేసులు నమోదు కాకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఆస్తి (ఇంటి) కోసమే వరుస హత్యలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాక్లుర్‌ కు చెందిన నిందితునిగా గుర్తించారు. 

ఇంటి కోసమే వరుస హత్యలు

మాక్లుర్‌కి చెందిన ప్రసాద్‌ కుటుంబం.. కొద్దిరోజుల క్రితం మాచారెడ్డికి షిఫ్ట్‌ అయింది. ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. స్నేహితుడు ప్రశాంత్‌.. ప్రసాద్‌ ఇంటిపై కన్నేశాడు. లోన్‌ అవసరం ఉందని చెప్పి అతని పేర రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. తీరా లోన్‌ రాకపోవడంతో తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రశాంత్‌పై ప్రసాద్‌ ఒత్తిడి తెచ్చాడు. ఇది తట్టుకోలేక ప్రశాంత్‌ హత్యలకు ప్లాన్‌ చేశాడు. మాట్లాడే పని ఉందంటూ ప్రసాద్‌ను బయటకు తీసుకెళ్లి.. కామారెడ్డి జాతీయ రహదారి సమీపంలో చంపేశాడు. మరుసటి రోజు ప్రసాద్‌ ఇంటికెళ్లాడు. ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారని నమ్మించి ఆయన భార్యను బయటకు తీసుకెళ్లాడు. ఆమెను చంపేసి బాసర నదిలో మృతదేహం పడేశాడు. ఆ తర్వాత ప్రసాద్‌ పెద్ద సోదరిని హతమార్చాడు. ఇద్దరు పిల్లల్ని సోన్‌ బ్రిడ్జి సమీపంలో .. చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో దారుణంగా చంపేశాడు. మొదటి మూడు హత్యలు ప్రశాంత్‌.. మిగతా ముగ్గురి హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు ప్రశాంత్‌ క్రైమ్‌ బ్యాగ్రౌండ్‌పైనా ఆరాతీస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !