Sunburn : హైదరాబాద్‌ సన్‌బర్న్‌ ఈవెంట్‌ రద్దు !

0


నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మదాపూర్‌లో నిర్వహించ తలపెట్టిన సన్‌బర్న్‌ కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి బుక్‌మై షోలో టికెట్ల విక్రయాన్ని కూడా నిలిపివేశారు. ఈ వ్యవహారంపై ఈవెంట్‌ నిర్వాహకుడు సుమంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి తీసుకోకుండా టికెట్లు విక్రయించినందుకుగానూ బుక్‌ మై షో, నోడల్‌ అధికారులకు నోటీసులిచ్చారు. ప్రస్తుతం బుక్‌ మై షోలో ‘సన్‌ బర్న్‌ షో హైదరాబాద్‌’ ఈవెంట్‌ కనిపించడం లేదు. విశాఖ వేదికగా జరగబోయే సన్‌బర్న్‌ ఈవెంట్‌ టికెట్లు మాత్రం అమ్ముడుపోతున్నాయి.

ఎలాంటి ఈవెంట్‌కైనా అనుమతి తీసుకోవాల్సిందే !

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో సన్‌బర్న్‌ మ్యూజిక్‌ ఈవెంట్‌ నిర్వహించ తలపట్టిన విషయం తెలిసిందే. మాదాపూర్‌లో ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లను బుక్‌ మై షో ద్వారా విక్రయిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ‘సన్‌ బర్న్‌’ ఈవెంట్‌ నిర్వహణ అనుమతులపై సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి తాజాగా స్పందించారు. ఆ ఈవెంట్‌కు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అనుమతి లేకుండా టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బుక్‌ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించామని.. అనుమతులు లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పామన్నారు. న్యూ ఇయర్‌ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేనని సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి స్పష్టం చేశారు. సన్‌బర్న్‌ అనేది భారీ స్థాయిలో నిర్హహించే సంగీత వేడుక. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో మద్యం అనుమతి ఉంటుంది. ఇదే అదనుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్‌కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆ వెంటనే సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్‌ నిర్వాహకుల్ని, బుక్‌ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకుని గట్టిగా మందలించారు. ఈ నేపథ్యంలో ఈవెంట్‌ నిర్వహణపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ వేడుల్లో మద్యం అనుమతి ఉంటుంది. హైదరాబాద్‌ను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా చేస్తామని సీఎం రేవంత్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వేడుకల్లో డ్రగ్స్‌ వినియోగించే ఛాన్స్‌ ఉందని.. అనుమతులపై కఠినంగా ఉండాలని సూచించారు.

నిర్వాహకులపై చీటింగ్‌ కేసు 

సన్‌బర్న్‌ హైదరాబాద్‌ ఈవెంట్‌లో మరో ట్విస్ట్‌ నెలకొంది. ఈవెంట్‌ నిర్వాహకుడిపై మాదాపూర్‌ పోలీసులు చీటింగ్‌ కేస్‌ నమోదు చేశారు.సన్‌ బర్న్‌ పేరుతో సుశాంత్‌ అలియాస్‌ సుమంత్‌ ఈవెంట్‌ నిర్వహించాలనుకున్నాడు. సుశాంత్‌పై మాదాపూర్‌ పోలీసులు చీటింగ్‌ కేస్‌ పెట్టారు. ఎలాంటి అనుమతి రాకున్నా బుక్‌ మై షోలో సన్‌ బర్న్‌ పేరుతో టిక్కెట్లు సుశాంత్‌ విక్రయించాడు. అసలు ఈవెంట్‌ లేకుండానే బుక్‌ మై షో లో టిక్కెట్లను సుశాంత్‌ పెట్టించాడు. సుశాంత్‌పై 420 ఐపీసీ సెక్షన్ల కింద మాదాపూర్‌ పోలీసులు కేస్‌ నమోదు చేశారు. చాలా మంది టిక్కెట్లు కొనుగోలు చేసేలా సుశాంత్‌ చేశాడు. డబ్బులు వసూలు చేసి ఎలాంటి ఈవెంట్‌ నిర్వహించకుండా సుశాంత్‌ మోసం చేశాడని మాదాపూర్‌ పోలీసులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !