Rajinikanth Birthday : స్టైల్‌, మ్యానరిజమ్స్‌కి వన్‌ & ఓన్లీ సూపర్‌స్టార్‌.

0


కేవలం స్టైల్‌​, స్వాగ్‌​, మ్యానరిజంతోనే బాక్సాఫీసు ముందు కాసుల వర్షం కురిపిస్తారాయన. చిన్న మేనరిజానికే ప్రేక్షకులు ఈలలు, గోలలతో మైమరిచిపోతారు. ఆరడగుల అందగాడు కాదు, ఆరు పలకల దేహం లేదు, అదిరిపోయే డ్యాన్సులు చేయలేడు కానీ ఆ రూపానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయనెవరో కాదు మన సూపర్‌ స్టార్‌ సూపర్‌ స్టార్‌​ రజనీకాంత్‌. సూపర్‌ స్టార్‌, తలైవా రజినీకాంత్‌ తెరపై ఎన్ని రాజభోగాలు అనుభవించినా కూడా తెర వెనుక మాత్రం ఎంతో సింపుల్‌గా ఉంటారు. సింప్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తారు. బయటకు వస్తే మేకప్పులు వేసుకోవాలి.. విగ్గులు పెట్టుకోవాలి.. కాస్ట్‌లీ బట్టలు వేసుకోవాలనే నియమాలు పట్టించుకోరు. సాధారణ వ్యక్తిలా వచ్చేస్తుంటారు. ఇక నడకలో ఆ ఠీవీ, రాజసం మాత్రం ఇప్పటికీ అలానే ఉంటుంది. వయసు పెరుగుతున్నా స్టైల్‌, స్వాగ్‌, మ్యానరిజంలో ఏ మాత్రం మార్పు రాలేదు. స్టైల్‌​కు కేరాఫ్‌ అడ్రస్‌​గా నిలిచిన రజనీ పుట్టిన రోజు మంగళవారం(డిసెంబరు 12). ఈ సందర్భంగా ఆయన అసమాన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

అంతులేని కథ’తో ఆరంభం..!

రజనీకాంత్‌ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌. 1950 డిసెంబరు 12న కర్ణాటకలో జన్మించారు. కొన్నాళ్లు కండక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటనపై మక్కువతో చెన్నైకి వెళ్లిపోయారు. అక్కడ మద్రాసు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి యాక్టింగ్‌లో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగల్‌’లో తొలి అవకాశం అందుకొని తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. తొలి సినిమా తర్వాత కన్నడలో ‘కథా సంగమ’ అనే చిత్రం చేశారు. మళ్లీ బాలచందర్‌ దర్శకత్వంలోనే ‘అంతులేని కథ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తమిళంలో ‘మూడ్రు ముడిచు’ అనే చిత్రాలు చేసి తిరుగులేని నటుడిగా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. అయితే రజనీ మొదట్లో విలన్‌​ పాత్రల్లో భయపెట్టారు. మొదట ప్రతినాయకుడిగా నటించి పేరు తెచ్చుకొన్న ఆయన ఆ తర్వాత కథానాయకుడిగా వరుస విజయాలు అందుకొన్నారు. 80, 90వ దశకాల్లో చేసిన సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. అలా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో వరుసగా నటిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.ఆరంభంలో విలన్‌​​గా భయపెట్టి..1977లో రజనీకాంత్‌ 15 సినిమాలు చేస్తే అందులో ఎక్కువగా నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలే చేశారు. మొదట ప్రతినాయకుడిగా నటించి పేరు తెచ్చుకొన్న ఆయన ఆ తరువాత కథానాయకుడిగా వరుస విజయాలు అందుకొన్నారు. 80, 90వ దశకాల్లో చేసిన సినిమాలు ప్రభంజనం సృష్టించాయి.

తెలుగులోనూ తనదైన ముద్ర

రజనీకాంత్‌ నటించిన దాదాపు అన్ని చిత్రాలు తెలుగులోనూ డబ్‌​ అయ్యాయి. దళపతి, నరసింహ, బాషా, ముత్తు, పెదరాయుడు, అరుణాచలం తదితర చిత్రాలు తెలుగులోనూ విశేష ఆదరణని సొంతం చేసుకొన్నాయి. చంద్రముఖి, శివాజీ, రోబో తదితర చిత్రాలు రజనీ స్థాయిని మరింత పెంచాయి. 2. ఓ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలను సృష్టించింది. గత కొన్నేళ్లుగా రజనీకాంత్‌ నుంచి సరైన సినిమా రాలేదు. బాక్సాఫీస్‌ వద్ద రజినీ స్థాయిలో హిట్టైన చిత్రాలు పడలేదు. 2.ఓ తరువాత పెట్టా, కబాలి, పెద్దన్న ఇలా ఏవేవో మూవీస్‌ వచ్చాయి. కానీ అవన్నీ కూడా సూపర్‌ హిట్లుగా నిలవలేదు. రీసెంట్‌గా వచ్చిన జైలర్‌ చిత్రం మళ్లీ రజినీ స్టామినా ఏంటో చూపించాయి. ఈ మూవీ ఆరువందల కోట్లకు పైగా కొల్లగొట్టి తలైవా సత్తాను చాటాయి. ఇప్పుడు రజినీ సినిమా అంటే బాక్సాఫీస్‌ భయపడిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇక రజినీ మళ్లీ తన విజయ పరంపర కొనసాగించాలని అభిమానులు కోరుతున్నారు.

అవార్డులు దాసోహం.

1981లో లతను వివాహం రజనీకాంత్‌ వివాహం చేసుకొన్నారు. ఈ దంపతులకు ఐశ్వర్య, సౌందర్య కుమార్తెలు. 2000లో పద్మభూషణ్‌, 2016లో పద్మవిభూషణ్‌ పురస్కారాల్ని స్వీకరించారు రజనీ. దేవుడి శాసించినప్పుడు రాజకీయాల్లోకి వస్తానని చెబుతూ వచ్చిన రజనీ 2017 డిసెంబరు 31న రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించారు. కేవలం ప్రతిభ ఉన్నంత మాత్రాన సినీ పరిశ్రమలో రాణించలేరు. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విషయాలు స్టార్స్‌ వ్యక్తిగత జీవితంలోనూ ఉండాలి. అప్పుడే వారిపై మరింత అభిమానం పెరుగుతుంది. నటన నచ్చితే కళ్లకు నచ్చుతారు. వ్యక్తిత్వం నచ్చితే మనసుకు దగ్గరవుతారు కదా. అలాంటి అంశాలు రజనీలో చాలా ఉన్నాయి. తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రజనీ సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడతారు. తన బాల్యమిత్రుడి ఇంటికి వెళ్లి వాళ్లతో కలిసి సాధారణంగా గడపడం, వీలైనప్పుడల్లా హిమాలయాలకు వెళ్లి ధాన్యం చేయడం ఆయనకు అలవాటు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వం ఆయన అభిమానులకు మరింతగా నచ్చుతుంటుంది.

73 ఏళ్ల వయసులోనూ..

ఏడుపదుల వయసులోనూ రజనీకాంత్‌ స్పీడ్‌ తగ్గలేదు, సరికదా మరింత దుసుకెళ్తున్నారు. ఇటీవల జైలర్‌​తో సూపర్‌​ హిట్‌ అందుకున్న తలైవా 2024లో మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. తన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌​తో ‘లాల్‌​ సలామ్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2024 జనవరిలో విడుదల కానుంది. ఇక జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘తలైవర్‌ 170’, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ లోకేశ్‌​ కనగరాజ్‌​తో ‘తలైవర్‌ 171’ సినిమా చేస్తున్నారు.

ప్రముఖుల శుభాకాంక్షలు !

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. ‘‘నా స్నేహితుడు రజినీకాంత్‌ విజయాల పరంపర కొనసాగాలి. ఆయురారోగ్యాలతో రజినీకాంత్‌ జీవితం ఆనందంగా సాగాలి’’ అంటూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌తో దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ చంద్రబాబు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఈరోజు 73 ఏళ్ళ వయసులో అడుగిడుతున్న సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !