youtuber arrest : ప్రేమ పేరుతో వంచన ! ప్రముఖ యూట్యూబర్‌ అరెస్ట్‌ !

0

ప్రేమించానన్నాడు.. వివాహం చేసుకుంటానంటూ నమ్మబలికాడు. తీరా పెళ్లి పేరు ఎత్తడంతో ముఖం చాటేశాడు. దీంతో ఆ గిరిజన యువతి ఫిర్యాదు చేయగా నార్సింగి పోలీసులు యూట్యూబర్‌ కోలా చంద్రశేఖర్‌ సాయికిరణ్‌ అలియాస్‌ చందుసాయి(30)ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరికి చెందిన చంద్రశేఖర్‌ సాయికిరణ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బండ్లగూడజాగీర్‌లో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. యూట్యూబ్‌ వీడియోలు, సినిమాల్లో సహనటుడిగా పేరు సంపాదించాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి (వైద్యురాలు) 2020లో హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. 2021 మార్చిలో డేటింగ్‌ యాప్‌లో ఆమెకు చంద్రశేఖర్‌ పరిచయమయ్యాడు. వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చాటింగ్‌ చేసుకున్నారు. అనంతరం కొద్దిరోజుల తరువాత ఇద్దరూ కలిసేవారు. ఆ సమయంలోనే  ఏడడుగులు నడుద్దామంటూ ఆమెతో బాసలు చేశాడు. 

ప్రేమ పేరిట లోబరుచుకున్నాడు

2021 ఏప్రిల్‌ 25న పుట్టిన రోజు వేడుకలకు రమ్మంటూ పుప్పాలగూడలోని ఇంటికి ఆహ్వానించాడు. అయిష్టంగానే వెళ్లిన ఆమెను ప్రేమ పేరిట లోబరుచుకున్నాడు. పెళ్లిచేసుకుంటానంటూ ప్రమాణం చేశాడు. నిజమని నమ్మిన ఆమె అతడి వద్దకు చేరింది.  సినిమాల్లో అవకాశాలు వస్తే గొప్పగా ఉండొచ్చంటూ చెప్పటంతో ఆమె నగలు తాకట్టుపెట్టి డబ్బులిచ్చింది. ఇటీవల ఆమె పెళ్లి ప్రతిపాదన తీసుకురావటంతో చంద్రశేఖర్‌ అసలు రూపం బయటపడిరది. రూ.3 కోట్లు తీసుకొస్తేనే పెళ్లంటూ వేధించాడు. తక్కువ కులం ఆడపిల్లను పెళ్లి చేసుకుంటే పరువు పోతుందంటూ అతడి తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ ఎస్‌.లక్ష్మినారాయణ, ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి పూర్తి ఆధారాలు సేకరించారు. దీంతో అత్యాచారం, మోసం కింద చందుపై 420, 376 (2) ఎస్సీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న చందు సాయిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. గురువారం చంద్రశేఖర్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. యువకుడి బంధువులు పరారీలో ఉన్నారు.

అన్‌సస్క్రైబ్‌ చేస్తున్న ఆడియన్స్‌

పక్కంటి కుర్రాడు అనే యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించి.. అందులో ఫన్నీ, సందేశాత్మక వీడియోలు పోస్ట్‌ చేసి తెలుగు ఆడియెన్స్‌ ను దగ్గరయ్యాడు చందు. అతని ఛానెల్‌ కు 13 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారంటే అర్థం చేసుకోండి మనోడి రేంజ్‌. ఇతడు నెలకు రూ.2 కోట్లు వరకు సంపాదిస్తాడని టాక్‌. అలాంటి వ్యక్తి తనను లవ్‌ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. గతంలో తన పుట్టిన రోజు అని చెప్పి ఇంటికి పిలిచి 2021 ఏప్రిల్‌ 25 వ తేదీన తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. చందు సాయి అసలు పేరు చంద్రశేఖర్‌ సాయి కిరణ్‌. ఈ కేసులో చందుతోపాటు అతడి తల్లిదండ్రులు, మరో ఇద్దరిపైనా బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో వారిందరిపైనా పోలీసులు కేసు రిజస్టర్‌ చేశారు. నిందితుడు చందు సాయిపై మాత్రం రేప్‌, చీటింగ్‌, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. యువతికి అన్యాయం చేసిన కేసులో జైల్లో ఉన్న చందుసాయిపై తీవ్రవ్యతిరేకత వ్యక్తం అవుతుంది. చందుసాయికి వ్యతిరేకంగా వందలాది మంది అన్‌సస్క్రైబ్‌ చేస్తున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !