Bhatti : తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించాం !

0

ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసమే మొదటి సారి ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీఎం రేవంత్‌తో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు.. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని మోదీని కోరడం జరిగిందన్నారు.  బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ ప్రాజెక్టులు ఇవ్వాలని కోరాం. పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా పరిగణనలోకి తీసుకోవాలని కోరాం. వెనకబడిన ప్రాంతాలకు రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని ప్రధానిని కోరాం’ అని భట్టి వెల్లడిరచారు. 

ఆర్థిక పరిస్థితిని ప్రధానికి 

తెలంగాణ కోసం ఓ సైనిక్‌ స్కూల్‌ కావాలని ప్రధానిని కోరామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీకి  వివరించామన్నారు. అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసిన విషయాన్ని కూడా ప్రధానికి వివరించామన్నారు. ఆయన అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించారన్నారు. రాత పూర్వకంగా అన్ని డిటైల్స్‌ మోదీకి అందించామన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో సహాయక సహకారాలు అందిస్తామో.. ఆ విధంగా అన్ని చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. అన్ని రకాల నిధులపై చర్చించామన్నారు, శాఖల వారీగా రిప్రంజటేషన్‌ చేశామన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 10 ఏళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌.. ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిందని డిప్యూటీ సీఎం భటి విక్రమార్క విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని గత ప్రభుత్వం తీసుకోలేకపోయిందని మండిపడ్డారు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, వీటిపై బీఆర్‌ఎస్‌ సర్కార్‌ తాత్సారం చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు పెండిరగ్‌లో నిధులు ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !