ANDHRAPRADESHలో ప్రభుత్వ ఉపాధ్యాయుల కొలువుల జాతర !

0

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. 6100 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాల భర్తీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలకు సంబంధించి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం జరిగింది. పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 

డీఎస్సీ విడుదలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రెండేళ్ల పాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్‌ విధానానికి అంగీకరించింది. పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిస్కంలకు రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం పొందిన సౌర పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీ సహా ఏపీ పబ్లిక్‌ సర్వీసులు నియామక, నియంత్రణ చట్ట సవరణను ఆమోదించింది.

 ఏపీ కేబినెట్‌ భేటీలోని కీలక అంశాలు,ముఖ్య నిర్ణయాలు..ఇవే..

  • న్యాయవాదుల సంక్షేమ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం
  • అసైన్డ్‌ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు అంగీకారం
  • ఏపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెజిస్లేచర్‌ స్టడీస్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
  • ముఖ్యమంత్రి కుటుంబ భద్రతకు ఏర్పాటు చేసే స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌లో 25 మంది హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి అంగీకారం
  • డిజిటల్‌ ఇన్‌ఫ్రా కంపెనీని రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం 
  • వైఎస్సార్‌ చేయూత నాలుగో విడతకు ఆమోదం.
  • ఫిబ్రవరిలో వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5 వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం.
  • ఎస్‌ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్‌ సిగ్నల్‌.
  • ఇంధన రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం.
  • ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం
  • ఎస్‌ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్‌ ఆమోదం
  • యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి  62కు పెంపు
  • అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం
  • నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్‌ పవర్‌ ప్రాజెక్టులకు ఆమోదం
  • శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
  • ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్‌ పోస్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
  • ఆ మేరకు చట్టంలో సవరణకు కేబినెట్‌ ఆమోదం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !