Ambati Rayudu : వపన్‌కళ్యాణ్‌తో అంబటి రాయుడు భేటీ !

0

టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల రాయుడు రాజకీయల్లో తీసుకున్న నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా కప్పుకున్న అతడు కొన్ని రోజుల్లోనే పార్టీ వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.అయితే అంబటి రాయుడు తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో భేటీ అయ్యాడు. సమావేశానికి గల కారణాలు వెల్లడిరచనప్పటికీ ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే జనసేన పార్టీలో రాయుడు చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్‌ కళ్యాణ్‌తో ఆయన చర్చించినట్టు సమాచారం. అంతేకాకుండా నిన్నటి నుంచి రాయుడు ఇన్‌స్టాగ్రామ్‌లో జనసేన పేజీని ఫాలో అవ్వడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

గుంటూరు ఎంపీ సీటు కోసమే చర్చలా ?

అంబటి రాయుడు తొలి నుంచి జగన్‌ సర్కార్‌పై పాజిటివ్‌గానే స్పందిస్తూ వచ్చాడు. దీంతో అంబటి రాయుడు డిసెంబర్‌లో వైఎస్సార్‌సీపీలో చేరారు.. ఈ నెల 6న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. కేవలం పది రోజులు మాత్రమే పార్టీలో కొనసాగారు. కానీ గుంటూరు సీటు ఆశించి భంగపడటంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్న 10 రోజుల్లోనే పార్టీకి గుడ్‌ బై చెప్పాడు. ఇదంతా పెద్ద చర్చకు దారితీయడంతో తాను త్వరలో దుబాయ్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో ఆడనున్నట్లు వెల్లడిరచారు. ప్రొఫెషన్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదు. అందుకే వైసీపీ రాజీనామా చేసినట్లు రాయుడు చెప్పుకొచ్చాడు. రాజకీయ చర్చకు ఎండ్‌ కార్డ్‌ వేశాడు. తిరిగి నిన్న జనసేన సోషల్‌ హ్యాండిల్‌ను ఫాలో అవడంతో మళ్లీ అంబటి రాజకీయ ఎంట్రీపై వార్తలు షికారు చేస్తున్నాయి. గుంటూరు ఎంపీ సీటుపై హమీ కోసం పవన్‌ కళ్యాణ్‌తో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. హామీ ఇస్తే, జనసేనలో చేరేందుకు సుముఖత, లేదంటే మర్యాదపూర్వక భేటీ అని తెలియవస్తోంది. అయితే అంబటి రాయుడు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు తన క్రికెట్‌ కెరీర్‌ను అంధకారంలోకి నెట్టేశాయనే విమర్శలు ఉన్నాయి. తాజాగా రాజకీయాల్లో కూడా అంబటి రాయుడు తొందరపాటు నిర్ణయాలతో నష్టమే తప్ప, అతనికి కలిసొచ్చే అంశంలా కనిపించడం లేదని పొలిటికల్‌ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !