Annapoorani : నయనతార సినిమా వివాదం...ఓటీటీ నుండి తీసేసిన నెట్‌ఫ్లిక్స్‌ !

0


లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించిన ‘అన్నపూరణి - ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ సినిమా ఇటీవలే నెట్‌ఫిక్స్‌లో విడుదలైంది. అయితే ఈ సినిమాపై వివాదాలుగ తలెత్తడంతో తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ఊహించని నిర్ణయం తీసుకుంది. సినిమాను తమ ఓటీటీ నుంచి తీసేసింది. నయనతార 75వ సినిమా అన్నపూరణి గత నెలలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి వ్యూస్‌ సాధిస్తుంది. ‘అన్నపూరణి - ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ చిత్రాన్ని దర్శకుడు నీలేష్‌ కృష్ణ తెరకెక్కించారు. సత్యరాజ్‌, జై ముఖ్య పాత్రలు పోషించారు. ట్రెడిషనల్‌ ఫ్యామిలీలో జన్మించిన అమ్మాయి చెఫ్‌గా ఎదగాలనే తన కలను ఎలా సాకారం చేసుకుంది? అనే కథతో దీనిని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాపై హిందూ సంఘాలు అభ్యంతరం తెలపడంతో వివాదం మొదలైంది. 

జీ స్టూడియోస్‌ క్షమాపణలు

శివసేన మాజీ నేత రమేష్‌ సోలంకి ఈ సినిమాపై కేసు కూడా పెట్టారు. దీంతో మేకర్స్‌పై ఎఫ్‌ఐర్‌ కూడా నమోదైంది. రెండు రోజుల క్రితం విశ్వహిందూ పరిషత్‌ నాయకుడు శ్రీరాజ్‌ నాయర్‌ కూడా సినిమాపై ఫైర్‌ అయ్యారు. రాముడు మాంసం తింటాడంటూ కించపరిచేలా సినిమాలో కొన్ని డైలాగులు ఉన్నాయని ఆయన అన్నారు. అలానే ఒక బ్రాహ్మణ అమ్మాయి మాంసాహారాన్ని ఇష్టపడటం, వండటం వంటి సీన్లను కూడా ఆయన వ్యతిరేకించారు. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌ నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. దీంతో సినిమాను నిర్మించిన జీ స్టూడియోస్‌ విశ్వ హిందూ పరిషత్‌కి క్షమాపణలు చెబుతూ సినిమాని నెట్‌ఫ్లిక్స్‌ నుంచి తొలగించేలా చేసింది. అయితే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ అన్నపూరణి కొత్త వెర్షన్‌ను మళ్లీ పెడుతుందా లేదా అని నయనతార ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ చిత్రం లవ్‌ జిహాద్‌ను ప్రేరేపించేలా ఉందని, ఒక హిందూ అమ్మాయి నమాజ్‌ చేసినట్లుగా సినిమాలో చూపించడంపై కూడా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. థియేటర్లో విడుదలైనప్పుడు సినిమాపై పెద్దగా విమర్శలు ఏమీ రాలేదు. కానీ ఓటీటీలో రిలీజ్‌ అయిన తర్వాత ఎక్కువ మందికి రీచ్‌ కావడంతో సినిమాపై వివాదం నెలకొంది.

ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుడు ఉంటాడు

తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ను హీరోయిన్‌​ నయనతార ప్రశంసించింది. ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైందీ జంట. అక్కడ నయనతార మాట్లాడుతూ ఓ దశలో ఎమోషనల్‌ అయింది. ‘‘ప్రతి మగాడి సక్సెస్‌​ వెనక ఒక స్త్రీ ఉంటుందని మనం విన్నాం. కానీ, విజయవంతమైన, సంతోషంగా ఉన్న స్త్రీ వెనుక కూడా పురుషుడు కచ్చితంగా ఉంటాడు. నేనే దీనికి ఉదాహరణ. చాలా ఏళ్లుగా సినిమాల్లో ఉంటున్నాను. ఈ సినీ జర్నీలో విఘ్నేశ్‌ను కలిశాను. అప్పటి నుంచి నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉంటూ ప్రోత్సాహిస్తూ వస్తున్నాడు. నా నిర్ణయాలను ఎప్పుడూ ప్రశ్నించలేదు. నాకు ధైర్యాన్నిస్తూ నడిపిస్తున్నాడు. ఏదైనా చేయగలను అనే నమ్మకాన్ని కల్పించాడు’’ అంటూ నయన్‌ చెప్పుకొచ్చింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !