బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఇవాళ ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయన 11.30నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. జగన్‌కు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్వాగతం పలికారు. తరువాత బంజారాహిల్స్‌లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు.హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న కేసీఆర్ ఇంటికి చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్‌ఎస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసిన జగన్ ఆయన ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించారు. కాగా డిసెంబరు 7వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్‌లో కాలు జారి కింద పడిపోయారు. కుటుంబ సభ్యులు ఆయణ్ను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కేసీఆర్‌ను పరిశీలించిన వైద్యులు ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
లంచ్ మీటింగ్
కేసీఆర్ ఇంటికి వెళ్తున్న జగన్ లంచ్ మీటింగ్‌కు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తరువాత తొలిసారి జగన్ కలవనున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 2019లో జగన్ సీఎం అయిన తరువాత తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించారు. మరోవైపు తాజాగా రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు.