CBN : టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట

0

  • ఐఆర్‌ఆర్‌, లిక్కర్‌, ఇసుక స్కాం కేసుల్లో ముందస్తు బెయిల్‌
  • తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఒకేసారి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి. మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్ట్‌ షరతులు విధించింది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌), ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్‌ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో ఆయన 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో..తాజాగా మందుస్తు బెయిల్‌ మంజురూ చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్‌ శ్రీనరేశ్‌కూ ముందస్తు బెయిల్‌ మంజూరైంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !