AP Politics : టీడీపీ, జనసేన కూటమితోనే బీజేపీ ?

0

ఇప్పటి వరకు జగన్‌ ప్రభుత్వానికి రహస్యంగా స్నేహహస్తం చాచిన బీజేపీ ఇప్పుడు అటోఇటో తేల్చుకునేందుకు సిద్దం అయ్యింది. రానున్న ఎన్నికల్లో ఎవరితో వెళితే లాభమో అంచనాలు వేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలతో కేంద్ర బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం అత్యవసరంగా సమావేశం అయింది. ఈ సమావేశంలో 2024 ఎన్నికలు, టీడీపీతో పొత్తుతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంతో పాటు, ఏపీలో పొత్తులపై ఎలా వెళ్లాలనే అంశంపై కోర్‌ కమిటీ సభ్యులు.. రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ సమావేశంలో రాష్ట్ర నేతలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒంటరిగా వెళ్లడం కన్నా పొత్తుతోనే వెళ్లాలని మెజారిటీ సభ్యులు కేంద్ర బీజేపీ కోర్‌ కమిటీకి అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి రాబోయే ఎన్నికలకు వెళ్తేనే మంచిదనే భావనను కొంతమంది వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకే ఓటు!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని నేతలు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫస్ట్‌ ప్రిఫరెన్స్‌ ఓటుని టీడీపీ పార్టీకి వేసిన విషయాన్ని కొంతమంది బీజేపీ నేతలు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకే వెళ్తుందని నేతలు చెప్పారు. కేంద్ర మంత్రులు ఏపీ పర్యటనలకు వచ్చి సీఎం జగన్‌ను కలవడానికి వెళ్లడం పట్ల పలువురు నేతల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీలో జరిగిన పొరపాటు ఆంధ్రలో జరగనివ్వద్దని మరో కీలక నేత చెప్పారు. ఆంధ్రలో కూడా వైసీపీ, బీజేపీ పార్టీలు ఒకటే అన్న భావనను తొలుత పోగొట్టాలని కేంద్ర కోర్‌ కమిటీని రాష్ట్ర నేతలు సూచించారు.

సీబీఐ విచారణ వేయాలి

పొత్తుకు వెళ్లే ముందు ఇసుక, లిక్కర్‌ అవకతవకలపై సీబీఐ విచారణను నియమిస్తేనే బీజేపీ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని మరో నేత సూచించినట్లు తెలుస్తోంది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత మాత్రమే బీజేపీ - టీడీపీ - జనసేన పార్టీలతో పొత్తుకు వెళ్లాలని మరో కీలక నేత కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంలో కూడా పలువురు బీజేపీని అనుమానిస్తున్నారని కొందరు నేతలు కోర్‌ కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజల్లో జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత పీక్‌లో ఉందని.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ సింగిల్‌గా వెళ్తే ఒక్క సీటు కూడా రాదని మరి కీలక నేత చెప్పినట్లు సమాచారం. టీడీపీ - జనసేన పొత్తులపై రాష్ట్ర స్థాయిలో ఎవరు మాట్లాడవద్దని కోర్‌ కమిటీ రాష్ట్ర నేతలకు సూచించింది. అందరి అభిప్రాయాలను కోర్‌ కమిటీ నేతలు నోట్‌ చేసుకున్నారు. బీజేపీ అధిష్ఠానానికి రాష్ట్ర పరిస్థితిని వివరించి తుది నిర్ణయం వారికే వదిలేయనున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పాలని కోర్‌ కమిటీ సమావేశం ప్రారంభంలో కోరింది. ఈ రోజు సమావేశంలో రాష్ట్ర నేతల చర్చించిన అభిప్రాయాలను ఢల్లీి హైకమాండ్‌కి తెలియజేస్తామని కేంద్ర కోర్‌ కమిటీ తెలిపింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !