నాంపల్లిలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ప్లాట్‌పారం సైడ్ వాల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 50 మందికి గాయాలయ్యాయి. ఒకరిద్దరు ప్రయాణికులు బాగా ఆందోళనకు గురైనట్టు సమాచారం. ప్రమాదం జరగడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురవుతున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న రైలు నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ట్రాక్ మీద నుంచి చార్మినార్ ఎక్స్‌ప్రెస్ కిందికి జరిగింది. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్టు సమాచారం. డెడ్ ఎండ్ లైన్ ప్రహరికి రైలు తాకింది. దీంతో ట్రాక్ మీద నుంచి రైలు బోగీలు కిందకి జరిగాయి. అయితే పెను ప్రమాదమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొంత మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అప్పటికే రైల్లోని ప్రయాణికులు అందరూ దిగారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దీంతో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎస్ 2, ఎస్ 3, ఎస్ 6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ నాంపల్లి స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వీరిని హుటాహుటిన లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించారు.
Charminar Express : నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ !
జనవరి 10, 2024
0
Tags