Jr NTR : బాబాయ్‌- అబ్బాయ్‌ల మధ్య మరోసారి బయటపడ్డ విభేదాలు !

0

నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. గత కొన్ని రోజులుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆయన బాబాయ్‌ నందమూరి బాలకృష్ణ మధ్య గ్యాప్‌ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రచారానికి బలం చేకూర్చే ఘటన ఒకటి చోటు చేసుకుంది.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇక ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తారక్‌, కల్యాణ్‌ రామ్‌ నివాళులర్పించారు. మరోవైపు అక్కడికి తారక్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బాలకృష్ణ అతడి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి చేరుకున్నారు. ఆయన తన తండ్రికి అంజలి ఘటించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. బాలకృష్ణ వెళ్లిపోయిన తర్వాత ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన తారక్‌ ఫ్లెక్సీలను బాలయ్య అభిమానులు తొలగించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. బాలకృష్ణ సూచనల మేరకే వీటిని తొలిగించారనే ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌ ఘాట్‌ ప్రవేశ ద్వారానికి అట్టహాసంగా జూ.ఎన్టీఆర్‌ ఫోటోలు ఉండటం చూసి వాటిని వెంటనే తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశిస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దీనిపై తారక్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా టీడీపీకి జూనియర్‌ ఎన్టీఆర్‌ పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

రాజకీయాల్లో చురుగ్గా జూనియర్‌ ఎన్టీఆర్‌ వర్గం ? 

హరికృష్ణ కుటుంబానికి కొడాలి నాని వీరవిధేయుడనే పేరుంది. కొడాలి నానికి ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించిందే జూనియర్‌ ఎన్టీఆర్‌. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని చంద్రబాబును ఒప్పించి మరి కొడాలి నానికి ఎన్టీఆర్‌ టికెట్‌ ఇప్పించారు. అలాంటి కొడాలి నాని టీడీపీ వ్యతిరేక పార్టీ అయిన వైసీపీలో చేరి అందరికి షాక్‌ ఇచ్చారు. ఈ సమయంలో ఎన్టీఆర్‌ చెబితేనే కొడాలి నాని వైసీపీలోకి వెళ్లారనే కామెంట్స్‌ కూడా తెర మీదకు వచ్చాయి. దీనిపై జూనియర్‌ ఎన్టీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించి మరి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ మరో అనుచరుడైన వల్లభనేని వంశీ సైతం టీడీపీకి గట్టి షాకే ఇచ్చారని చెప్పాలి. 2019 ఎన్నికల్లో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆయన జగన్‌ పార్టీకి అనుకూలంగా మారిపోయారు. అటు కొడాలి నాని .. ఇటు వల్లభనేని వంశీ కానీ ఇద్దరికి రాజకీయ జీవితం కల్పిచింది జూనియర్‌ ఎన్టీఆరే. అలాంటిది వీరిద్దరు ఆయనకు చెప్పకుండా పార్టీ మారుతారంటే నమ్మే పరిస్థితి లేదని టీడీపీ నాయకుల వాదన. ఇక ఎన్టీఆర్‌ సొంత మామ నార్నే శ్రీనివాసరావు సైతం గత ఎన్నికల్లో వైసీపీలో చేరి ఆ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. తాజాగా ఎన్టీఆర్‌కు ఇష్టమైన దర్శకుడు వివి. వినాయక్‌ సైతం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అటు వైసీపీ అధిష్టానం సైతం వి.వి.వినాయక్‌కు టికెట్‌ ఇవ్వడానికి సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇలా జూనియర్‌ ఎన్టీఆర్‌ అనుచరులంతా టీడీపీని వీడటంపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా టీడీపీకి హ్యాండ్‌ ఇచ్చి.. వైసీపీలో చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది రాజకీయ అవసరాల కోసం జరిగిందా లేక జూనియర్‌ ఎన్టీఆర్‌ తన అనుచర గణాన్ని ఒక్కొక్కరిగా రాజకీయాల్లోకి పంపుతున్నారా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !