KTR : తెలంగాణకు ఏకైక గొంతుక బీఆర్‌ఎస్‌ !

0


నాడు నేడు ఏనాడైనా తెలంగాణ గళం, బలం, దళం తామేనని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు. రానున్న 2024 పార్లమెంట్‌ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో కేసీఆర్‌కే ఎందుకు ఓటేయ్యాలో కేటీఆర్‌ వివరించారు. తెలంగాణ ప్రజల స్వరాన్ని పార్లమెంట్‌లో గట్టిగా, స్పష్టంగా వినిపించేది కేవలం బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేనని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

లోక్‌సభల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు 4754 ప్రశ్నలు

దానికి ఉదాహరణ.. 16, 17వ లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు తెలంగాణ హక్కులు, ప్రయోనాల కోసం కేంద్రాన్ని నిలదీసిన సందర్భాన్ని గుర్తు చేశారు. తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్రాన్ని ఎన్నిసార్లు ప్రశ్నించారో అనే వివరాలను గణాంకాలతో సహా వివరించారు కేటీఆర్‌. 16, 17వ లోక్‌సభల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు 4754 ప్రశ్నలు అడిగారని కేటీఆర్‌ తెలిపారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు 1271, బీజేపీ ఎంపీలు 190 ప్రశ్నలు మాత్రమే అడిగారని ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం కేంద్రాన్ని డిమాండ్‌ చేసేది బీఆర్‌ఎస్‌ ఎంపీలు మాత్రమేనని తేల్చి చెప్పారు. 2014లో రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక బీఆర్‌ఎస్‌ (అప్పటి టీఆర్‌ఎస్‌) అన్నారు. 2024లో కూడా తెలంగాణకున్న ఏకైక గొంతుక తమ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. మరోవైపు భారత్‌ రాష్ట్ర సమితి లోక్‌ సభ సన్నాహక సమావేశాలు రెండో దఫా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నాగర్‌ కర్నూల్‌ సన్నాహక సమావేశం జరిగింది. నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. సీనియర్‌ నేతలు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, నిరంజన్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, మధుసూధనాచారి వారితో సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికల ఓటమిపై సమీక్షతో పాటు లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు. పది నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశాలు పూర్తయ్యాయి. ఇవాళ్టి నుంచి 22వ తేదీ వరకు మిగిలిన ఏడు నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. రేపట్నుంచి వరుసగా మహబూబ్‌నగర్‌, మెదక్‌, మల్కాజిగిరి నియోకవర్గాల సమావేశాలు ఉంటాయి. 21వ తేదీన సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ నియోజకవర్గాల సమావేశం జరుగుతుంది.22వ తేదీన నల్గొండ నియోజకవర్గంతో సమావేశాలు ముగియనున్నాయి. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్యనేతలు హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో సన్నాహక సమావేశాల్లో పాల్గొంటారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమిని విశ్లేషిస్తూనే లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తారు. సమావేశానికి వచ్చిన ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలు సేకరించడంతో పాటు వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !