Rajyasabha : రాజ్యసభకు ఎన్నికల షెడ్యూల్‌, తెలుగు రాష్ట్రాల్లో 6 ఖాళీలు !

0

రాజ్య సభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న 56 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈసీ షెడ్యూల్‌ ప్రకారం.. ఫిబ్రవరి 8న రాజ్య సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. అదే నెల 27 పోలింగ్‌ జరగనుంది. కాగా, తెలంగాణలో మూడు రాజ్య సభ స్థానాలు ఖాళీ కానున్నాయి. బీఆర్‌ఎస్‌ రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌, బడుగుల లింగయ్య యాదవ్‌, వద్దిరాజు రవిచంద్రల పదవి కాలం ఈ ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ మూడు స్థానాలకు సైతం ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్య సభ స్థానాలు ఖాళీ కానున్నాయి. సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిల పదవి కాలం ఏప్రిల్‌ 2వ తేదీతో ముగియనుండగా.. ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ తాజా షెడ్యూల్‌ ప్రకారం అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ నుంచి 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 10 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. బిహార్‌లో 6, మహారాష్ట్రలో 6, పశ్చిమబెంగాల్‌లో 5, మధ్యప్రదేశ్‌ 5, గుజరాత్‌ 4, కర్ణాటకలో 4, ఒడిశా, రాజస్థాన్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మూడేసి చొప్పున స్థానాలకుబీ హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్‌ జరగనుంది.

రాజ్యసభలో పైచేయి సాధించటం కోసం...

ఏపీ నుంచి వైసీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్‌, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్‌ పదవీ విరమణ చేయనున్నారు. వీరి స్థానంలో మరో ముగ్గురి ఎంపిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. అసెంబ్లీలో సంఖ్యా బలం ప్రకారం మూడు సీట్లు ప్రస్తుతానికి వైసీపీకి దక్కే అవకాశం కనిపిస్తోంది. ముగ్గురు అభ్యర్దులు గెలవాలంటే ఒక్కో రాజ్యసభ అభ్యర్దికి 58 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఇక, ఇప్పుడు ఏపీలో రెండు పార్టీల నుంచి 9 మంది పైన అనర్హత పిటీషన్లు పెండిరగ్‌ లో ఉన్నాయి. గంటా రాజీనామా ఆమోదించారు. దీంతో ఈ పది మంది పైన స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటే సభలో సంఖ్య బలం 165కి చేరుతుంది. అప్పుడు ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే 55 మంది చొప్పున మద్దతు అవసరం. వైసీపీలో సీట్లు దక్కక బయటకు వచ్చిన వారిని కలుపుకొని ఒక సీటు దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఆ అవకాశం టీడీపీకి లేకుండా రాజ్యసభలో తొలి సారి టీడీపీని జీరో చేసేలా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలోనే ఇప్పుడు స్పీకర్‌..హైకోర్టు కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నుంచి రాజ్యసభకు కొత్తగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, అరణి శ్రీనివాసులకు అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. దీని ద్వారా రెడ్డి, ఎస్సీ, బలిజ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాజ్యసభ ఎన్నికల్లో పై చేయి సాధించటం ద్వారా ప్రత్యర్ధి పైన నైతిక విజయం సాధించే క్రమంలో సీఎం జగన్‌..చంద్రబాబు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్దం అవుతున్నారు.

ఎన్నికల తేదీలివే..

నోటిఫికేషన్‌ జారీ: ఫిబ్రవరి 8

నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: ఫిబ్రవరి 15

పరిశీలన : ఫిబ్రవరి 16

ఉపసంహరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 20

పోలింగ్‌ తేదీ : ఫిబ్రవరి 27

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఓటింగ్‌ పూర్తయిన తర్వాత అదే రోజు (ఫిబ్రవరి 27) సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిరచనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !