TSPSC ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి

0

  • మహేందర్‌ రెడ్డి నియామకానికి గవర్నర్‌ ఆమోద ముద్ర
  • త్వరలో బాధ్యతలు చేపట్టనున్న మహేందర్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ ఎం. మహేందర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై ఆమోద ముద్ర వేశారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్‌ రెడ్డి పేరును ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్‌ ఓకే చెప్పారు. దాంతో ఆయన టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గతంలో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా ఉన్న బి. జనార్ధన్‌ రెడ్డి సహా ఇతర సభ్యులు ఇటీవల రాజీనామా చేశారు. గవర్నర్‌ వారి రాజీనామాలకు ఆమోదముద్ర వేయగా.. కొత్త ఛైర్మన్‌ కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్‌, సభ్యుల పదవి కోసం మ్నెత్తం 371 దరఖాస్తులు రాగా.. అందులో 50 వరకు ఛైర్మన్‌ పదవి కోసం వచ్చాయి. చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమార్‌ నేతృత్వంలోని కమిటీ, లా సెక్రటరీ తిరుపతి, జీఏడీ సెక్రటరీ నిర్మలాదేవితో కలిసి టీఎస్‌పీఎస్సీ  చైర్‌పర్సన్‌, సభ్యుల పదవుల కోసం వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలించారు. ఆ తర్వాత ఛైర్మన్‌ పదవికి సంబంధించిన పేర్లతో షార్ట్‌ లిస్టు చేసి గవర్నర్‌కు పంపగా.. మహేందర్‌ రెడ్డి నియామకానికి గవర్నర్‌ ఓకే చెప్పారు. సభ్యుల నియామకం కూడా పూర్తి కానుడంగా.. త్వరలోనే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్‌ ఉంది.

మహేందర్‌ రెడ్డి నేపథ్యం..

ఎం. మహేందర్‌ రెడ్డి 3 డిసెంబరు 1962లో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామంలో నారాయణ రెడ్డి, అచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన నల్గొండ జిల్లా సర్వేల్‌ గురుకుల పాఠశాలలో ప్రాధమిక విద్యను, వరంగల్‌ ఎన్‌ఐటి నుంచి ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎన్‌ఐటీ ఢల్లీిలో ఎంటెక్‌ చదువుతుండగా.. ఐపీఎస్‌కు సెలక్టయ్యారు. 1986 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి కాగా.. తొలి పోస్టింగ్‌ కరీంనగర్‌ జిల్లా అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌గా పని చేసారు. ఆ తర్వాత గుంటూరు, బెల్లంపల్లిలో పని చేసి నిజామాబాద్‌, కర్నూల్‌ ఎస్పీగా పని చేశాడు. 1995లో హైదరాబాద్‌ తూర్పు జోన్‌ డీసీపీగా, సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఫ్యాకల్టీగా, ఇంటెలీజెన్స్‌ చీఫ్‌, గ్రేహౌండ్స్‌ ఐజీగా వివిధ హోదాల్లో పని చేశాడు. 2 జూన్‌ 2014న హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గా నియమితుడయ్యాడు. డీజీపీ అనురాగ్‌ శర్మ పదవీవిరమణ చేయడంతో ఆయన 12 నవంబర్‌ 2017న ఇన్‌చార్జి డీజీపీగా నియమితుడై, 10 ఏప్రిల్‌ 2018న పూర్తి స్థాయి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా నియమితుడయ్యాడు. డిసెంబర్‌ 2022లో మహేందర్‌ రెడ్డి పదవీ విరమణ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !