NagaVamsi : గుంటూరు కారం...సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ !

0

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌. రాధాకృష్ణ నిర్మించారు. మహేష్‌-త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్‌ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రాబోయే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతోంది. సంక్రాంతికి వస్తుందా? రాదా? అనే డౌట్‌ నుండి.. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. సెన్సార్‌ నుండి ఈ చిత్రానికి యు/ఏ  (U/A)సర్టిఫికేట్‌ జారీ చేశారు. సంక్రాంతి పండుగకు పర్ఫెక్ట్‌ సినిమా అనేలా.. సెన్సార్‌ నుండి ఈ సినిమాకు సూపర్బ్‌ పాజిటివ్‌ టాక్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది. సెన్సార్‌ టాక్‌ విన్న తర్వాత నిర్మాత నాగవంశీ ట్విట్టర్‌ ద్వారా టాక్‌ ఎలా ఉంటుందనేది తెలియజేశారు. ‘‘చూడగానే మజా వస్తుంది.. హార్ట్‌ బీట్‌ పెరుగుతుంది.. ఈల వేయాలి అనిపిస్తుంది’’ అని నాగవంశీ ట్విట్టర్‌ వేదికగా ఈ సినిమా రిపోర్ట్‌ని తెలియజేశారు. అంతేకాదు, నేను చెప్పిన ఈ మాట, అలాగే ఈ డేట్‌ని గుర్తు పెట్టుకోండి అంటూ చాలా ధీమాగా చెప్పుకొచ్చారు. ఆయన కాన్ఫిడెన్స్‌ చూస్తుంటే.. బొమ్మ బ్లాక్‌బస్టర్‌ పక్కా అనేలా అయితే అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

జనవరి 12న విడుదల

టాలీవుడ్‌ క్రష్‌ శ్రీలీల, మరో యంగ్‌ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో రమ్య కృష్ణ, ప్రకాష్‌ రాజ్‌ సహా పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్‌ రైట్స్‌, ఆడియో రైట్స్‌ రికార్డు ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణా థియేట్రికల్‌ రైట్స్‌కు దాదాపుగా రూ. 120 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్‌ వైడ్‌ థియేట్రికల్‌ రైట్స్‌ రూ. 155 కోట్లకు క్లోజ్‌ అయినట్టు సమాచారం.  ఓ రీజినల్‌ సినిమాకు ఇది ఓ భారీ రికార్డు అని అంటున్నారు ట్రేడ్‌ విశ్లేషకులు.ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్‌ నటులు సునీల్‌, అజయ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు రమ్యకృష్ణ, ప్రకాష్‌ రాజ్‌, జగపతి బాబు, రఘుబాబు వంటి వారు ఇందులో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌  ముఖ్య అతిథిగా పవన్‌ కళ్యాణ్‌

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఈ నెల 6న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఆ రోజే ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్‌ వాళ్లు చాలా కాలం తర్వాత మహేష్‌ బాబును పోకిరి తరహాలో పాత్రలో చూసినట్టు చెబుతున్నారు. సర్కారు వారి పాట మూవీలో కూడా మాస్‌ తరహా పాత్ర పోషించిన మహేష్‌ బాబు.. ఇందులో మాస్‌ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా తన మేనరిజంతో ఆకట్టుకున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమా సబ్జెక్ట్‌ కూడా కొత్తగా ఉన్నట్టు చెప్పినట్టు సమాచారం. మొత్తం పర్పెక్ట్‌ సంక్రాంతి సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాల నేపథ్యంలో ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ జారీ చేసారు. ఇక ఈ సినిమాలో మహేష్‌ బాబు రెమ్యూనరేషన్‌ గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ రూమర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది..  ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం మహేష్‌ బాబు జీఎస్టీతో కలిపి రూ.  78 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. ఓ పాన్‌ ఇండియా కానీ.. తెలుగు సినిమాకు ఈరేంజ్‌ రెమ్యూనరేషన్‌ అంటే.. మామూలు విషయం కాదనీ.. ఇదో బెంచ్‌మార్క్‌ అని అంటున్నార. దాదాపుగారూ.  200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !