Student Suicide : జేఈఈ నావల్ల కాదు.. తనువు చాలించిన మరో విద్యార్థి !

0

పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన  రాజస్థాన్‌ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థిని తనువు చాలించింది.కోటా ప్రాంతంలో నివసిస్తున్న నిహారిక అనే 18 ఏళ్ల విద్యార్థిని జేఈఈ పరీక్షకు సిద్ధమవుతోంది. జనవరి 31వ తేదీన జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురైన నిహారిక.. తన ఇంట్లోని తను ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. న్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. తాను జేఈఈలో ఉత్తీర్ణత సాధించలేనంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసి తనువు చాలించింది.

ఒత్తిడి వల్ల  ఆత్మహత్య

‘అమ్మా, నాన్న.. ఈ జేఈఈ నావల్ల కాదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. నాకున్న ఆప్షన్‌ ఇదొక్కటే.. నేనో చెత్త కూతుర్ని. నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్‌ నోట్‌లో రాసింది. విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న కోటా పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోచింగ్‌ హబ్‌ అయిన రాజస్థాన్‌లోని కోటాలో ఒత్తిడి వల్ల విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఈ ఏడాదిలో ఇది రెండో ఆత్మహత్య ఘటన కావడం గమనార్హం. ఈనెల 23వ తేదీ నీట్‌ విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు చెందిన మహ్మద్‌ జైద్‌ మెడికల్‌ కళాశాల ప్రవేశ పరీక్ష అయిన నీట్‌కు సన్నద్ధమవుతున్నాడు. జవహర్‌నగర్‌ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో 23వ తేదీన రాత్రి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక 2023లో కోటాలో ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవడంతో కేంద్రం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా శిక్షణ ఇవ్వాలని సూచించింది. అటు విద్యార్థుల మరణాలను నియంత్రించేందుకు భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్‌ ఫ్యాన్లను అమర్చారు. అయినప్పటికీ ఇవి ఆగకపోవడం కలవరపెడుతోంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !