Narasaraopet : నరసరావుపేట TDP MPగా లావు శ్రీకృష్ణదేవరాయులు ?

0

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకి ఈ సారి అదే స్థానం నుంచి టికెట్‌ ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్‌ రెడ్డి నిరాకరించినట్టు తెలుస్తోంది. గుంటూరు నుంచి పోటీ చేయాలని లావుకు జగన్‌ సూచించారట. అయితే గుంటూరు నుంచి తాను పోటీ చేయబోనని శ్రీకృష్ణదేవరాయలు తేల్చి చెప్పారు. నరసరావుపేట టికెట్‌ లావుకి ఇవ్వాలని లోక్‌సభ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం సీఎంను కోరినప్పటికీ ఫలితం దక్కలేదట. ఇంతమంది చెప్పినా జగన్‌ వినిపించుకోలేదని టాక్‌. తాను గుంటూరు నుంచి పోటీ చేయలేనని, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని సీఎంకు లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేసినట్టు సమాచారం. నరసరావుపేట ఎంపీ టికెట్‌ మోదుగల వేణుగోపాలరెడ్డికి ఇచ్చి గుంటూరు స్థానాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇవ్వాలనేది సిఎం జగన్‌ ప్రతిపాదన కాగా, తనకు నరసరావుపేట ఇస్తే పోటీ చేస్తానని లేని పక్షంలో బరి నుంచి తప్పుకుంటానని సీఎంకు లావు శ్రీకృష్ణ దేవరాయలు తేల్చి చెప్పారట.

టీడీపీ వైపు శ్రీకృష్ణదేవరాయలు చూపు !

వైసీపీలో ఇక సీటు కేటాయించే అవకాశం లేకపోవటంతో లావు టీడీపీ వైపు చూసే అవకాశాల గురించి పరిశీలిస్తున్నట్లు సమాచారం. టీడీపీ నుండి మొదటి ప్రాధాన్యతగా నరసరావుపేట ఎంపీ సీటు కాగా, రెండో ప్రాధాన్యతగా గుంటూరు నుండి పోటీ చేసినా ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు సమాచారం. రాయపాటి సాంబశివరావు తరువాత స్థానికంగా అంత పెద్ద నేతలు లేకపోవటంతో టీడీపీ కూడా శ్రీకృష్ణదేవరాయలుకు కలిసొచ్చే అంశం. సౌమ్యుడిగా, అభివృద్ధి ప్రధాత ఇప్పటికే పేరు తెచ్చుకున్న లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో మరి కొద్ది రోజుల్లో తేలనుంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !