సీనియర్ హీరో నాగార్జున చేసిన ‘ది ఘోస్ట్’ సినిమా పెద్దగా అలరించలేపోయింది. ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి నాగార్జున స్టార్ డమ్‌పై అనుమానాలు కలిగించేలా చేసాయి. దీంతో సరైన కథతో అది కూడా మాస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌తో రాబోతున్నారు. అందులో భాగంగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో ‘నా సామి రంగ’ అనే సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాకు ‘ధమాకా’ మూవీకి కథను అందించిన బెజవాడ ప్రసన్న కుమార్ కథను అందిస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌ను చూస్తుంటే.. సంక్రాంతికి సరిగ్గా సరిపోయే కథతో వస్తున్నట్లు తెలుస్తోంది.
అన్నదమ్ముల మధ్య సాగే కథ
ముఖ్యంగా ఓ ఊళ్లో ముగ్గురు అన్నదమ్ముల మధ్య సాగే కథగా తెలుస్తోంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ట్రైలర్.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండనుంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రలు ట్రైలర్‌లో ఆకట్టుకుంటున్నాయి. ఇక హీరోయిన్స్‌గా అషికా రంగనాథ్, రుక్సర్ ధిల్లాన్, మిర్ణా మీనన్‌లు కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.నా సామిరంగ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు 32 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. ఇక ఈ సినిమా కోసం నాగార్జున 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇక ఈ సినిమా 45 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా, డిజిటల్ రైట్స్‌ను హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది.
🔥ఈసారి పండక్కి నా సామి రంగ!🔥#NaaSaamiRangaTrailer!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 9, 2024
▶️ https://t.co/gc6N8rpOO7#NaaSaamiRangaOnJAN14 #NSRForSankranthi@allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @SS_Screens @boselyricist pic.twitter.com/K943LPkpMO
నా సామిరంగ
నా సామి రంగ’ టైటిల్ విషయానికొస్తే.. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘సిపాయి చిన్నయ్య’లోని నా జన్మభూమి ఎంతో అందమైన దేశము.. నా ఇల్లు అందులో కమ్మని ప్రదేశము.. నా సామి రంగ అంటూ ఓ పాట ఉంటుంది. అందులో నుంచే ‘ నా సామిరంగ’ అనే తీసుకున్నారు. టైటిల్ కూడా ఊర మాస్‌గా ఉంది. నాగార్జున కూడా మాస్ ప్రేక్షకులపై దృష్టి పెట్టి ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని మసాలాలు నూరి ఇందులో వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు నాగార్జున.. మోహన్ రాజాతో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. మోహన్ రాజా ఇటీవల చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాను దర్శకత్వం వహించారు. ఇక నాగ్ తన 101వ సినిమా కోసం ఓ మలయాళీ సినిమాను రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో పొరింజు మరియం జోస్ అనే సినిమాను తెలుగులో నాగార్జున చేయనున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారని తెలుస్తోంది.