‘పుష్ప తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ రష్మిక. ఇటీవల ‘యానిమల్’తో విజయాన్ని అందుకున్న ఈ భామ తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కి ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రాలైన ‘పుష్ప 2’, ధనుష్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘యానిమల్’ కోసం రణ్‌బీర్ కపూర్‌తో వర్క్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. సందీప్ ఆలోచనా విధానం చూసి షాకయ్యా. రణ్‌బీర్‌ను కొట్టే సన్నివేశం నటిగా నాకొక సవాల్ అనిపించింది. ఒక్క టేక్‌లోనే ఆ సీన్ షూట్ చేశాం. యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో రష్మిక, రణ్ విజయ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించారు. జోయా పాత్రలో తృప్తి దిమ్రి యాక్ట్ చేసింది. ఓ సీన్‌లో భాగంగా జోయాతో శృంగారంలో పాల్గొన్నానని రణ్ విజయ్ వచ్చి తన భార్య గీతాంజలితో చెబుతాడు. దీంతో ఈమెకు కోపమొచ్చి భర్త చెంపపై గట్టిగా లాగి పెట్టి కొడుతుంది. అయితే ఈ సీన్ పూర్తయిన తర్వాత తను ఏడవడంతో పాటు గట్టిగట్టిగా అరిచానని రష్మిక చెప్పింది.
ఓ భార్య ఎలా ఫీల్ అవుతుందో అలానే
సందీప్ సీన్‌ను వివరించి.. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఓ భార్య ఎలా ఫీల్ అవుతుందో అలానే రియాక్ట్ అవ్వాలని సందీప్ నాకు చెప్పాడు. నాకు అది మాత్రమే గుర్తుంది. యాక్షన్, కట్ మధ్యలో ఏం జరిగిందో గుర్తు లేదు. రణ్‌బీర్ మీద కేకలు వేశా. కోపంతో అతడిని చెంపపై కొట్టా. షాట్ ఓకే అని దర్శకుడు చెప్పినా నా కన్నీళ్లు ఆగలేదు. బాగా ఏడ్చేశా. తర్వాత రణ్‌బీర్ వద్దకువెళ్లి.. ‘అంతా ఓకేనా’ అని అడిగా. ‘యానిమల్’ సీక్వెల్ విషయంలో సందీప్ ఎంతో క్లారిటీతో ఉన్నారు. పార్ట్ 1కు వచ్చిన స్పందనలను దృష్టిలో ఉంచుకుని తను అనుకున్నది స్క్రీన్‌పైకి తీసుకువస్తారు’. ‘పుష్ప 2’ గురించి నేను ఒకే ఒక్క మాట చెప్పగలను. మీరు ఊహించిన దానికంటే భారీ స్థాయిలో ఉండనుంది. ‘పుష్ప ది రైజ్’ సక్సెస్‌తో మాపై బాధ్యత పెరిగింది. ఇటీవల నేను ఒక పాట షూట్‌లో పాల్గొన్నా. ఇది ముగింపు లేని కథ. మనం అనుకున్నట్లు దీనిని తీర్చిదిద్దవచ్చు. ఈ సినిమా విషయంలో నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. ఇందులో నా పాత్ర చాలా మెరుగ్గా ఉంటుంది. శేఖర్ కమ్ముల - ధనుష్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నా’’ అని ఆమె చెప్పారు.