Rayapati : చంద్రబాబు ఫోటోను నేలకేసి కొట్టిన రాయపాటి !

0

టీడీపీకి ఊహించని షాక్‌ తగిలింది. టీడీపీకి చెందిన రాయపాటి రంగబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగబాబు తాను సత్తెనపల్లి నుంచి సీటు ఆశించారని, కానీ....అది వేరొకరికి కేటాయించారని అన్నారు. ఆ సీటును కన్నా లక్ష్మీనారాయణకు ఇస్తున్నట్లుగా కనీసం తమకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రభావోద్వేగానికి గురై చంద్రబాబు ఫోటోని తీసి నేలకేసి కొట్టారు. టీడీపీ దిక్కుమాలిన పార్టీ అంటూ మండిపడ్డారు.. ఆ పార్టీకి రాజీనామా చేసిన రాయపాటి రంగారావు. టీడీపీ అసలు రాజకీయ పార్టీయే కాదని.. ఒక  వ్యాపార సంస్థగా ఆయన అభివర్ణించారు. మా కుటుంబాన్ని సర్వ నాశనం చేసింది టీడీపీ.. గత ఎన్నికల్లో 150 కోట్లు మా నుంచి తీసుకున్నారు. లోకేష్‌, చంద్రబాబు మా దగ్గర ఎంత తీసుకున్నారో  లెక్కంతా ఉంది. మంగళగిరిలో లోకేష్‌ ఎలా గెలుస్తాడో చూస్తా. లోకేష్‌ను మంగళగిరిలో ఓడిస్తానంటూ రంగారావు సవాల్‌ విసిరారు.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.కియా కంపెనీ తానే తెచ్చారని చెప్పుకునే చంద్రబాబు.. మరి రాయలసీమలో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను చంద్రబాబు, లోకేష్‌ ఎక్కడ పనిచేయనివ్వలేదు. కన్నా లక్ష్మీనారాయణ ఒక్క కులానికి పని చేస్తాడని, తాము అన్ని కులాలకు పని చేస్తామని రాయపాటి రంగారావు అన్నారు.

టీడీపీకి షాకుల మీద షాకులు !

ఎన్నికల వేళ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్‌ నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. విజయవాడ, గుంటూరులలో కేశినేని, రాయపాటి కుటుంబాలు టీడీపీకి అండగా నిలుస్తూ వచ్చాయి. చంద్రబాబు విధానాలు నచ్చక ఆ నేతలు సైకిల్‌ దిగారు. మొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్‌ బై చెప్పగా, నేడు రాయపాటి రంగారావు రాంరాం చెప్పారు. మరో నేత లింగమనేని శివరామ ప్రసాద్‌ కూడా రాజీనామా చేశారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అందులో ఉన్న లింగమనేని.. ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా ప్రకటించారు. అదే బాటలో మరికొందరు సీనియర్‌ నేతలు నడవనున్నట్లు సమాచారం. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !