పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నారు. నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నట్లు ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడిరచారు. ఇంతకుముందు షోయబ్ మాలిక్‌కు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరి విడాకుల గురించి గత కొన్ని నెలలుగా వార్తలు వస్తోన్న తరుణంలో వారిరువురీ బహిరంగంగా ప్రకటించ లేదు తప్ప, చాలా రోజులుగా వారివురీ వివాహబంధం బీటలు వారిందని ఇప్పటికీ బయటపడిరది. షోయబ్-సానియా విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం విడాకులు అనేది చాలా కష్టమంటూ సానియా సోషల్ మీడియాలో పోస్టుపెట్టారు. అది వైరల్‌గా మారిన తరుణంలో మాలిక్ మరో వివాహం గురించి నేడు ప్రకటన చేశారు. ఆయనకు ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం. 2010లో అయేషాతో విడాకులు తీసుకున్న ఆయన.. అదే ఏడాది సానియాను వివాహమాడారు. ఈ వేడుక అప్పట్లో అందర్నీ ఆకర్షించింది. 2018లో వారికి కుమారుడు జన్మించాడు. మరోవైపు సనా జావేద్‌కు కూడా ఇంతకుముందే వివాహం జరిగింది. 2020లో పాక్‌కు చెందిన ఓ సింగర్‌ను పెళ్లిచేసుకున్న ఆమె.. 2023లో అతడితో విడిపోయింది.
మీడియా ప్రచారం చేసినట్టుగానే !
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మధ్య గత కొన్ని రోజులుగా విడాకుల విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ విడాకుల వార్తలపై ఇప్పటి వరకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మాజీ పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ బహిరంగంగా మాట్లాడలేదు. ఈ క్రమంలోనే సానియా మీర్జా తాజాగా విడాకులు, వివాహానికి సంబంధించి ఇన్‌స్టాస్టోరీలో ఒక రహస్య పోస్ట్‌ను పంచుకున్నారు. ఆ పోస్ట్‌లో ‘వివాహం కష్టం, విడాకులు తీసుకోవడం కష్టం. మీ కష్టమైన మార్గాన్ని ఎంచుకోండి’. ‘ఊబకాయం కష్టం, ఫిట్‌గా ఉండడం కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి’. ‘అప్పులు చేయడం కష్టం. ఆర్థిక క్రమశిక్షణ కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి’. ‘చర్చలు జరపడం కష్టం. మాట్లాడకపోవడమే కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి’. ‘జీవితం ఎప్పుడూ సులభం కాదు. ఇది ఎల్లప్పుడూ కష్టంగా ఉంటుంది. కానీ మన కష్టమైన మార్గాన్ని మనం ఎంచుకోవచ్చు. తెలివిగా ఎంచుకోండి’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో విడాకుల ప్రకటన చేయడానికి మానసికంగా సిద్ధం అయినట్లు తెలుస్తోంది.