NagaVamsi : నెగెటివ్‌ ప్రచారంపై గుంటూరుకారం నిర్మాత సీరియస్‌ !

0

గుంటూరు కారం సినిమా మీద వచ్చిన రివ్యూలు, మౌత్‌ టాక్‌ గురించి అందరికీ తెలిసిందే. బయట ట్రెండ్‌ చూస్తే మాత్రం గుంటూరు కారం సినిమాకు ఎక్కువగా జనాలు ఆదరణ చూపించడం లేదు. బుక్‌ మై షోలో ఏమో థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. టికెట్లు బుక్‌ అవ్వడం లేదు. కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. అధికారికంగా నిర్మాణ సంస్థ కలెక్షన్ల పోస్టర్లను రిలీజ్‌ చేస్తోంది. అయితే గుంటూరు కారం మీద జరగుతున్న చర్చల మీద నిర్మాత నాగవంశీ మీడియా సమావేశం నిర్వహించారు. గుంటూరుకారం సినిమా ఎంతటి విజయం సాధించిందో వివరించారు. ‘‘ఈ సినిమా మీద కొంతమంది కావాలని నెగటివ్‌ ప్రచారం చేశారు, పనికట్టుకొని మరీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు, అయినా కూడా సినిమా పెద్ద విజయం సాధించి, డిస్ట్రిబ్యూటర్స్‌ కి లాభాలు తెచ్చిపెట్టింది,’’ అని నాగవంశీ తెలిపారు. గుంటూరు కారం సినిమా వన్‌ మెన్‌ షో ఏమీ కాదని, మహేష్‌ బాబు అందంగా కనిపించినా, చక్కగా నటించినా, డ్యాన్సులు వేసినా.. అదంతా త్రివిక్రమ్‌ చేయించిందే కదా? అని నాగవంశీ అన్నారు. 

మాస్‌ ఎంటర్‌టైనర్‌ అనుకుని 

ఈ సినిమాకు అర్దరాత్రి షోలు వేయడం తప్పైనట్టుగా ఉందని భావిస్తున్నా.. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ సినిమా అని సరిగ్గా ప్రొజెక్ట్‌ చేయలేకపోయామని అనుకుంటున్నా.. అలా అర్దరాత్రి షోలు వేయడంతో.. మాస్‌ సినిమా అని అనుకున్న ఫ్యాన్స్‌ కాస్త నిరాశ పడి ఉండొచ్చు.. ఈ సినిమాను మేమే సరిగ్గా ప్రొజెక్ట్‌ చేయలేకపోయామని, అదే మా తప్పని అనుకుంటున్నామని నిర్మాత నాగవంశీ అన్నారు. ఇదే సమయంలోనే ఈ సినిమాకి కావాలని సామాజిక మాధ్యమాల్లో, కొంతమంది మీడియా తప్పుడు ప్రచారం చేశారని, ఆ ప్రభావం మొదటి రోజు వుండిరది అని, కానీ తరువాత కుటుంబ ప్రేక్షకులు చూసి, సినిమా బాగుంది అని చెప్పడంతో ప్రేక్షకులు ఆదరించారని చెప్పారు వంశీ. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అనే విషయాన్ని మేము ముందుగా ఇంకా బాగా ప్రచారం చేసి ఉంటే బాగుండేది అని, ప్రేక్షకుడిని ఈ సినిమాకి తగిన విధంగా తయారు చెయ్యలేకపోయాయేమో అని అనిపిస్తూ ఉంటుంది అని చెప్పారు. సినిమాను రివ్యూలేమీ ఎఫెక్ట్‌ చేయలేదు.. మా సినిమాను రివ్యూలు ఎఫెక్ట్‌ చేశాయంటే నేను ఒప్పుకోను.. రివ్యూ అనేది పర్సనల్‌ ఒపీనియన్‌.. ఆ ఒపీనియన్‌ను మీరు మీ మీ వెబ్‌ సైట్స్‌లో రాస్తారు.. అది రైట్‌ అని ఏంటి గ్యారంటి? మీరమైనా సర్వేలు చేయించారా? ఎగ్జిట్‌ పోల్స్‌ మాదిరిగా.. అది మీ పర్సనల్‌ ఒపీనియన్‌.. అది తప్పని చెప్పే రైట్‌ నాక్కూడా ఉంటుంది.. మీరేమైనా దేవుళ్లా?.. మీ రివ్యూలకు ఎలాంటి వ్యాల్యూ ఉండదు అంటూ ఇలా నాగవంశీ మీడియా మీద మండిపడ్డాడు. ఈ సినిమాని కొనుక్కున్నవాళ్ళు అందరూ సేఫ్‌ అని, వాళ్ళందరూ హ్యాపీగా వున్నారని వంశీ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా గురించి మొదటి రోజు బాగా నెగటివ్‌ ప్రచారం చేసారని, అందుకని మొదటి రోజు ప్రేక్షకులు కొంచెం గందరగోళానికి గురయ్యారని, కానీ రెండో రోజు నుండి కలెక్షన్స్‌ మళ్ళీ అదిరిపోయాయని నిర్మాత నాగవంశీ చెప్పారు. జనవరి 4న మా చేతికి సినిమా వచ్చింది.. సరిగ్గా ప్రమోట్‌ చేసుకునే టైం కూడా లేదు.. మా జానర్‌ ఇది.. మా సినిమా ఇలా ఉంటుంది.. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ అని చెప్పుకునే టైం కూడా లేదు.. ఫస్ట్‌ రోజు ఆడియెన్స్‌, ఫ్యాన్స్‌ కాస్త గందరగోళానికి గురయ్యారు.. కానీ ఆ తరువాత ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఈ సినిమాకు కనెక్ట్‌ అయ్యారు.. కలెక్షన్లు బాగానే పెరిగాయి.. అన్ని చోట్ల అన్ని జానర్లు ఆడవు.. అలా ఓవర్సీస్‌లో మా సినిమా అంతగా ఆడలేదు.. కానీ చాలా చోట్ల బ్రేక్‌ ఈవెన్‌కు దగ్గరగా వచ్చింది.. కలెక్షన్లు బాగున్నాయి అంటూ నాగవంశీ అన్ని విమర్శలను తిప్పి కొట్టాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !