ఆమె ఓ కంపెనీ సీఈవో.. మామూలు కంపెనీ కాదు.. ఏఐ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ చేసే మైండ్ ఫుల్ ఏఐ ల్యాబ్ వ్యవస్థాపకురాలు ఈ సుచనా సేథ్.. బెంగళూరుకు చెందిన ఈ మహిళా ఈసీవో సుచన సేథ్.. కుమారుడితో కలిసి గోవా వెళ్లింది. అక్కడ సర్వీస్ అపార్ట్ మెంట్ తీసుకున్నది.. అక్కడే తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసింది.. ఎందుకు చంపింది.. కారణాలు తెలియకపోయినా.. ఈ ఘటన మాత్రం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన సుచనా సేథ్.. గత శనివారం తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి గోవా లో ఓ హోటల్ లో దిగింది. తిరిగి సోమవారం హోటల్ రూమ్ ను ఖాళీ చేసి క్యాబ్ లో కర్ణాటకకు బయలుదేరింది. అనంతరం రూమ్ క్లీన్ చేసేందుకు వచ్చిన హౌస్ కీపింగ్ సిబ్బందికి అక్కడ రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హోటల్ లోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. ముందుగా హోటల్ కు వచ్చినప్పుడు తన కొడుకుతో వచ్చిన సుచన సేథ్.. వెళ్లేటప్పుడు ఒంటరిగా కనిపించింది. దీంతో పోలీసులకు అనుమానం కలిగింది.
బ్యాగులో చిన్నారి మృతదేహం
ఈ క్రమంలో పోలీసులు ఆమె వెళ్లిన ట్యాక్సీ డ్రైవర్‌కు ఫోన్ చేసి సుచనాతో మాట్లాడారు. తన కుమారుడిని ఫ్రెండ్ ఇంటి వద్ద వదిలేసినట్లు చెప్పిన సుచన్ సేథ్.. ఇదే తన ఫ్రెండ్ అడ్రస్ అంటూ ఇచ్చింది. చివరకు అది ఫేక్ అని తేలడంతో పోలీసుల అనుమానం మరింత బలపడిరది. దీంతో కర్ణాటక పోలీసులకు సమాచారం అందించారు. వారు క్యాబ్ డ్రైవర్ కు ఫోన్ చేసి కొంకిణి బాషలో మాట్లాడుతూ కారును చిత్రదుర్గలోని పోలీస్ స్టేషన్‌కు మళ్లించమని చెప్పారు. చివరకు ఆమెను చిత్రదుర్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఆమె తన కుమారున్ని ఎందుకు చంపింది అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భర్తపై ద్వేషంతో కొడుకును హతమార్చిందా ?
39 ఏళ్ల సుచనకు, ఆమె భర్త వెంకట్ రామన్‌కు మధ్య వివాదాలే చిన్నారి హత్యకు దారితీసినట్లు గోవా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సీఈఓకు భర్త వెంకట్ రామన్ మద్య గొడవలు రావడంతో ఇద్దరు విడిపోయారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. అయితే కుమారుడిని భర్త నుంచిదూరంగా ఉంచేందుకు గోవా టూర్ ప్లాన్ చేసింది. గత శనివారం నార్త్ గోవాలోని బనియన్ గ్రాండ్ హోటల్‌లో దిగింది. తన కుమారుడితో కలిసి చెక్ ఇన్ అయ్యింది. అక్కడే గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని హతమార్చింది.